తిరుపతి టీడీపీ మీటింగ్ లో తమ్ముళ్ల ఫైటింగ్?

Update: 2021-03-23 05:30 GMT
తిరుపతి ఉప ఎన్నికతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అగ్రనేతల ఎదుటే సత్యవేడు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పరస్పరం కొట్టుకోవడం కనిపించింది. దీంతో అగ్రనేతలు సైతం షాక్ కు గురైన పరిస్థితి నెలకొంది.

చిత్తూరు జిల్లా సత్యవేడులో తిరుపతి ఉప ఎన్నిక సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ అగ్రనేతలకు చేదు అనుభవం ఎదురైంది. సత్యవేడులో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఈ రచ్చ జరిగింది.

టీడీపీ అగ్రనేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ ముఖ్య నాయకుల ఎదుటే వీరి పెనుగులాట కనిపించింది.

సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హెచ్. హేమలత , పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి జేడీ రాజశేఖర్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. సత్యవేడు నియోజకవర్గ ఇన్ చార్జి ఎవరో చెప్పాలని హేమలత వర్గీయులు పట్టుబట్టడంతో ఈ వివాదం నెలకొంది. సత్యవేడు ఇణ్ చార్జి రాజశేఖర్ ను తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఉప ఎన్నిక అనంతరం ప్రత్యే సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని నేతలు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.

హేమలత, జేడీ రాజశేఖర్ వర్గీయులు విడిపోయి పరస్పరం వాదనకు దిగి కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. అనంతరం ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రసంగిస్తుండగా అదే గందరగోళం. దీంతో ఆమె ప్రసంగాన్ని ఆపేశారు. ఈ రసాభాస కుమ్ములాటలతో తిరుపతిలో టీడీపీ గెలుపు కష్టమేనని అంటున్నారు.
Tags:    

Similar News