ఆపరేషన్ ఆకర్ష్ అన్నది నయా రాజకీయ ట్రెండ్. అవతల పక్షం లో ఉన్న వారికి తీసుకురావడం ద్వారా తమ బలం పెరిగిందని చెప్పుకోవడం, ప్రత్యర్ధిని డీ మోరలైజ్ చేయడం. జనాలకు కూడా తాము గట్టిగా ఉన్నామని చెప్పడం. ఈ తరహా రాజకీయాలు టీడీపీ తరచూ చేస్తూ ఉంటుంది. ఇపుడు వైసీపీ కూడా అదే బాటన నడుస్తోంది. మేము మా పార్టీ తలుపులు తెరవం, మాకు ఏ అవసరం లేదు అని చెబుతూ వచ్చిన వైసీపీ పెద్దలు ఇపుడు మాత్రం టీడీపీని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే రాజకీయ అవసరం వైసీపీకి బాగానే వచ్చింది అంటున్నారు.
నిజానికి వైసీపీలో లెక్కలు మిక్కిలిగా లీడర్స్ ఉన్నారు. పైగా ప్రతీ నియోజకవర్గంలో వర్గ పోరు తీవ్రస్థాయిలో ఉంది. ఇక ఎక్కువ మంది నాయకులు ఉండడం కూడా ఇబ్బందికరమే అని వైసీపీలో పరిణామాలు చెబుతున్న వేళ ఉన్న వారిని వదిలేసి టీడీపీకి గేలం వేయడం రాజకీయంగా కరెక్టేనా అంటే మాత్రం వైసీపీ పెద్దలు రైట్ డెసిషన్ అంటున్నారు. దీని వల్ల మొదట వచ్చే ప్రయోజనం టీడీపీని వీక్ చేయడం అని చెబుతున్నారు.
టీడీపీలో ఈ రోజుకు కూడా చాలా బలమైన నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే అక్కడ కూడా టికెట్ కోసం గట్టి పోటీ ఉంది. దాంతో ఆ పరిస్థితిని తమకు అవకాశంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తోందిట. టికెట్లు దక్కవనుకున్న వారిని టార్గెట్ చేసి వైసీపీలో చేర్చుకోవడం ద్వారా వారికి గట్టి భరోసా కల్పించాలనుకుంటున్నారుట.
వారు బలంగా ఉంటే టికెట్లు కూడా ఇవ్వాలని చూస్తున్నాట్లుగా చెబుతున్నారు. అదే విధంగా అవకాశం లేకపోతే వారికి వేరే విధంగా అకామిడేట్ చేసైనా తమ వద్ద ఉంచుకోవాలనుకుంటున్నారు. ఇలా మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాలలో టీడీపీ స్ట్రాంగ్ నేతల వేట స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. ఈ జాబితా కూడా రెడీ అయిందని తెలుస్తోంది.
ఈ లిస్ట్ ఇపుడు జగన్ ఫైనలైజ్ చేసి తలుపులు బార్లా తెరిస్తే కనుక కచ్చితంగా రాజకీయ సంచలనం నమోదు అవుతుంది అంటున్నారు. టీడీపీలో ఉన్న బడా నేతలను అధికార బలంతో తమ వైపునకు తిప్పుకోవాలని వైసీపీ చూడడం మాత్రం రాజకీయ ఎత్తుగడగానే చెబుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో వర్గ పోరు ఉన్న వేళ దాన్ని సర్దుబాటు చేయకుండా కొత్తగా టీడీపీ నుంచి నేతలను తెస్తే మరింత కంగాళీ అవుతుంది అన్న మాట కూడా పార్టీలో చర్చకు వస్తోంది.
ఈ డెసిషన్ వల్ల సానుకూలం కాకపోతే అనుకోని బిగ్ ట్రబుల్స్ కూడా ఎదురవుతాయని కూడా అంటున్నారు. అయితే టీడీపీ బలపడుతోందని తెలిసే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపింది అని మరో వాదన కూడా ఉంది. ఇక్కడ ఒక్కటి మాత్రం వాస్తవం. నాయకులను ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి తేగలరు. కానీ జనాలలో మారిన అభిప్రాయాలను ఎవరూ మార్చలేరని అంటున్నారు. ఈ రాజకీయ క్రీడ కేవలం బయట గొప్పగా చెప్పుకోవడానికే బాగుంటుంది తప్ప నిజంగా పార్టీ బలోపేతానికి దారి తీయదు అని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి వైసెపీఎలో చేరే తమ్ముళ్ళు ఎవరో, వారి జాబితా ఏంటో అన్నది.