రాజకీయాల్లో పదవి ఏదైతేనేం అల్టిమేట్ గా అధికారం ఉండాలి. కనీసం అధికార పార్టీలో అయినా ఉండాలి. పవర్ అనేది ఒక కిక్కు. ఒక్కసారి అలవాటు అయితే వదిలిపెట్టడం కష్టం. అందులో రాజకీయాల్లో ఉన్నవాళ్లు.. అందులోంచి బయటకు రారు. తమ వారసుల్ని కూడా రాజకీయాల్లోకే తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎమ్మెల్యే అయినా. ఎంపీ అయినా ఫర్వాలేదు ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉండాలని అనుకుంటారు.
అసలే ఇది ఎన్నికల సీజన్ కావడంతో.. ఎమ్మెల్యే సీట్లుకు ఫుల్ డిమాండ్ ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. ఈసారి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది సీనియర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రీసెంట్ గా టీడీపీకి రాజీనామా చేశారు. కారణం ఆయనకిు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు. భీమిలి ఎమ్మెల్యే అవ్వాలని ఉంది. కానీ చంద్రబాబు భీమిలి ఇవ్వడం కుదరదని చెప్పడంతో.. పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీ లో చేరారు. ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుది అదే పరిస్థితి. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కాకినాడ ఎంపీ తోట నరసింహం తనకు ఎంపీ సీటు వద్దని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. తన భార్యకు జగ్గంపేట ఎమ్మెల్యే సీటు కావాలని అడిగారు. చంద్రబాబు ఇవ్వకపోయేసరికి వైసీపీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇక రాజకీయాలంటే తనకు భలే ఆసక్తి అని 2014 ఎన్నికల ముందు చెప్పిన రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్.. ఇకమీదట తాను అసలు పోటీ చేయనని.. పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించారు. మరోవైపు.. కొన్ని ఎంపీ స్థానాలకు అసలు టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదు. ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డిని పోటీ చేయమంటే ఆయన ససేమిరా అన్నారు. నెల్లూరు ఎంపీ స్థానాన్ని ఎవ్వరూ అడగడం కూడా లేదు. ఇలా చాలా ఎంపీ స్థానాల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగులు, కొత్తవాళ్లు అందరూ ఆసక్తి చూపడం లేదు.
ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఎమ్మెల్యే అయితే.. లోకల్ గా ఎంతోకొంత సంపాదించుకోవచ్చు. ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి రావడంతో పాటు పదింతలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అన్నింటికి మించి నియోజకవర్గంలో ప్రజల ఆదరణ ఉంటుంది. ఇక ఎన్నికల్లో 15 - 20 కోట్లు ఖర్చుపెడితే.. గెలుపు గ్యారెంటీ. కానీ ఎంపీ సీటు అలాకాదు. ఒక్కో ఎంపీకింద సుమారుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికల ఖర్చు మొత్తం పోటీ చేయబోయే ఎంపీనే భరించాలి. ఎమ్మెల్యేకు 5 కోట్లు వేసుకున్నా.. దాదాపు 50 కోట్ల వరకు ఖర్చుపెట్టాలి. తీరా ఇంత ఖర్చు పెట్టిన తర్వాత గెలుస్తామన్న నమ్మకం లేదు. గెలిచినా.. కూడా స్థానికంగా ఎలాంటి పనులు అవ్వవు. ఏవైనా చేసుకుంటే ఢిల్లీ స్థాయిలోనే. అదికూడా మోదీ వచ్చిన తర్వాత చాలా కష్టంగా మారింది. కాంట్రాక్టులు అన్నీ బీజేపీ వారికి వెళ్తున్నాయి తప్ప వేరే వారికి రావడమే లేదు. ఇక ఎంపీ అంటే ప్రజల్లో కూడా పెద్దగా ఫాలోయింగ్ ఉండదు. దీంతో.. అంతకుముందు కాస్తో కూస్తో పేరున్నా.. అది కాస్తా తుడిచిపెట్టుకుని పోతుంది. ఎక్కువుగా ఢిల్లీలో ఉండడం వల్ల తనని నమ్ముకున్న వారికి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఎంపీ. కేంద్రస్థాయిలో ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నవారికి లోక్‌సభ ఎంపీ పదవి ఉపయోగపడుతుంది తప్ప లోకల్ వ్యాపారాలు ఉన్నవారికి పెద్దగా యూజ్ ఉండదు. అందుకే..టీడీపీ సిట్టింగ్ ఎంపీలంతా.. లోక్‌సభ అంటేనే భయపడిపోతున్నారు.