మంత్రివర్గ ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల పనితీరుపై దృష్టి సారించకపోవడంపై సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పేషీలోనే ఫైళ్లు పెండింగ్ లో ఉంటే దానిని పట్టించుకోని బాబు - మంత్రుల పనితీరుపైనే దృష్టి సారించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని అంటున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీలపై గత నాలుగు నెలల నుంచీ మీనమేషాలు లెక్కబెడుతుండడంపై సీనియర్లు అలకగా ఉన్నారు. ఇక్కడ పనిచేయలేకపోతున్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. వీలైనంత త్వరగా వెళ్లిపోతే మంచిదన్న వ్యాఖ్యలు కొంతమంది అధికారుల నుంచి బహిరంగంగానే వినిపిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
గత క్యాబినెట్ లో కెఇ శాఖకి సంబంధించిన అధికారాలన్నీ లాగేసుకున్నారు. దానితో ఇక ఆయనకు అధికారుల్లో ఏం విలువ ఉంటుంది? పీతల సుజాత శాఖలో ఆమె మాట వినని అధికారులను నియమిస్తే ఆమె ఏం ప్రతిభ చూపిస్తుంది? అన్ని ఫైళ్లూ అధికారులే చూస్తే ఇక ఆమె వైఫల్యం ఎక్కడున్నట్లు? శిద్దా రాఘవరావు సొంతం గా తీసుకున్న నిర్ణయాలేమున్నాయి? కీలక నిర్ణయాలన్నీ ఆయన గవర్నమెంటుకే వదిలేశారు కదా? మరి ఆయన శాఖ ఎందుకు మార్చారు? పల్లె రఘునాధరెడ్డి మాట విన్న అధికారులెవరో చెప్పండి? ఇవన్నీ బాబుగారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) లోనే వందల ఫైళ్లు పెండింగ్ లో ఉంటే, ఇక బాబు ఆశించిన పాలన ఎలా సాధ్యమవుతుందన్న మాటలు పార్టీలో వినిపిస్తున్నాయి.
ఆయా మంత్రులు తమకు నచ్చిన, అనుకూలంగా ఉండే అధికారులను తెచ్చుకునే వీలు లేకుండా పోయిందని పలువురు అంటున్నారు. చంద్రబాబు ప్రతి శాఖలోనూ జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ పరిస్థితిని మారుస్తారో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/