కృష్ణా జిల్లా అన్నంతనే టీడీపీకి అంతో ఇంతో పట్టు ఉన్న జిల్లాగా చెబుతారు. మరీ.. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు తప్పించి.. చాలా సందర్భాల్లో టీడీపీకి అండగా నిలిచిన జిల్లాల్లో కృష్ణా ఒకటి చెప్పక తప్పదు. మరి.. అలాంటి పట్టు ఉన్న పార్టీ అధికారంలో ఉన్న వేళ.. విపక్ష నేత పాదయాత్ర చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు ఒక మోస్తరుగా ఉండొచ్చన్న మాట టక్కున చెబుతారు.
కానీ.. గడిచిన కొద్దిరోజులుగా కృష్ణా జిల్లాలో విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందన ఇప్పుడు టీడీపీ వర్గాలకు వణుకు పుట్టేలా మారింది. ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర 156 రోజులకు చేరుకుంది. కడప జిల్లాలో మొదలైన జగన్ ప్రజా సంకల్ప యాత్ర రాయలసీమలోని అన్ని జిల్లాల్ని పూర్తి చేసుకొని నెల్లూరు.. ప్రకాశం.. గుంటూరుజిల్లాల్ని పూర్తి చేసి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సాగుతోంది. సోమవారం జగన్ కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో పాదయాత్ర సాగింది.
అనంతరం గుడివాడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజాస్పందన చూసిన టీడీపీ నేతలు విస్మయానికి గురి అవుతున్నారు. గుడివాడలో ఇంత భారీ ఎత్తున ప్రజలు రావటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కెమేరా ఫ్రేమ్ మొత్తాన్ని దాటిపోయేలా ఉన్న జనసందోహం చూస్తే.. జగన్ కు ఆదరణ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
జగన్ రాక కోసం గంటల ముందు నుంచే నిరీక్షించిన ప్రజలు..జగన్ సుదీర్ఘ ప్రసంగానికి స్పందించిన తీరు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో సరికొత్త శక్తిని ఇస్తే.. అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టేలా చేసిందని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ సభలకు పోటెత్తుతున్న జనసందోహంపై టీడీపీ నేతలు పలువురు ఏదో తేడా కొట్టేస్తుందన్న మాటను తమ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేయటం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని.. ఇదంతా విపక్ష నేతకు సానుకూలంగా మారిందని చెబుతున్నారు. దాదాపు కిలోమీటరు పైనే.. ఇసుక వేస్తే రాలనంతగా జన సందోహంతో గుడివాడ పట్టణం నిండిపోయిందన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. ఇప్పటివరకూ జగన్ పాదయాత్రలో గుంటూరు జిల్లా పర్యటన హైలెట్ గా చెబుతుంటే.. తాజాగా కృష్ణా జిల్లాలో వెల్లువెత్తుతున్న జన సందోహం బాబు సర్కారుకు ప్రమాద సంకేతాల్ని పంపుతున్నట్లుగా చెప్పక తప్పదంటున్నారు.