లోకేష్... టీడీపీని కొంప‌ముంచే చాన్స్ ఉందా?!

Update: 2022-06-06 16:30 GMT
టీడీపీలో కానీ, నంద‌మూరి అభిమానుల్లో కానీ.. చంద్ర‌బాబును న‌మ్ముతున్నారు కానీ, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న మాజీ మంత్రి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌ను మాత్రం న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు టీడీపీ వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు.  ఎందుకంటే.. లోకేష్ మీద అప‌న‌మ్మ‌క‌మే! ఆయ‌న‌కు రాజ‌కీయ ఆలోచ‌న లేద‌ని, ముఖ్యంగా దీర్ఘ‌కాలికంగా పార్టీని నిల‌బెట్టే ఆలోచ‌న కూడా అస‌లు లేద‌ని.. వారు గుస‌గుస లాడుతున్నారు. ఎంత వ‌ర‌కు కూడా.. లోకేష్‌.,. షార్ట్ రూట్స్‌లో పైకి వ‌చ్చేందుకు.. జేజేలు కొట్టించుకునేందుకు ఆలోచ‌న చేస్తాడ‌ని అంటున్నారు.

రాజ‌కీయం అంటే.. చంద్ర‌బాబు మాదిరి దీర్ఘ‌కాలం ఆలోచ‌న ఉండాల‌ని సూచిస్తున్నారు. కానీ, లోకేష్ రాజకీయం చూస్తే.. మాత్రం ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీలో జూనియ‌ర్ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు కూడా నాయ‌కుల‌కు లోకేష్ ప‌ట్ల స‌ద‌భిప్రాయం క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు. అంతేకాదు.. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఒక‌టి ఉంది. అందేంటంటే.. వైసీపీ మీద ఉన్న వ్య‌తిరేక‌తను లోకేష్ త‌న‌కు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

టీడీపీ వ‌ర్గాలు మాత్రం జ‌న‌సేన‌తో పొత్తు ఉందేమో అని యాక్టివ్‌గా లేరు. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. గోదావ‌రి జిల్లాల కాపు సామాజిక వ‌ర్గం ఎటు వైపు ఉంటే.. ఆ పార్టీ నాయ‌కుడే సీఎం అవుతున్నారు. ఈ గోదావ‌రి జిల్లాల్లో చంద్ర‌బాబు మీద న‌మ్మం బాగానే ఉంది.

కానీ, లోకేష్‌కు పెత్త‌నం ఇస్తే.. త‌మ‌ను రోడ్డుపాలు చేస్తాడేమో అని వాళ్ల‌లో గాబ‌రా పెరిగిపోతోంది. ఉదాహ‌ర‌ణ‌కు లోకేష్ టీంలో ఉన్న మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి వార‌సురాలు.. గ్రీష్మ మ‌హానాడులో వాడిన భాష ఒక్క‌సారిగా ఏమైంది.,. అని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

వైసీపీలో బూతుల మంత్రులు ఉన్నార‌ని చెప్పే.. టీడీపీ స‌డ‌న్‌గా మ‌హానాడు భాష‌ని ఛీ కొడుతున్నారు. లోకేష్ టీం వ‌ల‌న టీడీపీ ఇబ్బంది ప‌డుతుంద‌ని.. చంద్ర‌బాబును బాగా న‌మ్ముతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కార‌ణంగా.. ఆయ‌న ప‌డుతున్న క‌ష్టం కార‌ణంగా పార్టీ మ‌ళ్లీ అదికారం లోకి వ‌స్తుంద‌ని సీనియ‌ర్లు న‌మ్ముతున్నారు.

అయితే.. సీట్ల పంచాయ‌తీలో చంద్ర‌బాబుకూడా లోకేష్‌కు పెత్త‌నం ఇస్తున్నాడ‌ని.. అప్పుడు ఆయ‌న‌కు రాజ‌కీయం ప‌రంగా ప‌రిజ్ఞానం లేద‌ని.. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో ఎవ‌రైతే మాట్లాడ‌తారో.. వారి జైకొట్టే చాన్స్ ఉంది. అలా ఇస్తే.. 2019 ఎన్నిక‌ల సీన్ రిపీట్ అవుతుంద‌ని అందుకే చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న ప్ర‌కారం పోతే.,. కొంచెం అయినా.. చాన్స్ ఉంటుంద‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News