బాబు నమ్మిన ఆ మంత్రులు వైసీపీలోకి జంప్ చేయడం ఖాయమా?

Update: 2019-04-26 14:13 GMT
తెలుగు రాష్ట్రాల పాలిటిక్సు చాలా మారిపోయాయి. ముఖ్యంగా నిత్య అధికారం కోసం నేతలు పాకులాడుతున్నారు. పార్టీల మధ్య అధికారం మారుతున్నా కొందరు నేతలు మాత్రం పార్టీలు మారుతూ అధికారంలో కొనసాగగలుగుతున్నారు. ఎంపీలు - ఎమ్మెల్యేలుగా గెలిచినా తమ పార్టీ అధికారంలోకి రాకపోతే అధికారంలో ఉన్న పార్టీలోకి మారి పనులు చేయించుకుంటున్నారు.. మంత్రి పదవులు పొందుతున్నారు. ఇలాంటి జాబితాలో చాలామంది నేతలున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినవారు టీడీపీలో చేరి మంత్రి పదవులు కూడా పొందారు. ఇప్పుడు టీడీపీ నేతలూ అదే ఫార్ములా అమలు చేయాలని చూస్తున్నారట. అందుకే... పోలింగ్ తరువాత కొద్దిమంది టీడీపీ నేతలు ఎక్కడా ప్రతిపక్ష నేత జగన్‌ పై ఒక్క మాట కూడా తూలకుండా సైలెంటయిపోయారట. అదృష్టం బాగుండి తాము గెలిస్తే... తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా మెల్లగా కొద్దికాలానికి వైసీపీలో చేరాలని ఆలోచిస్తున్నారట.
   
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు - ఎంపీలుగా మొన్నటి సారి ఉన్నవారితో పాటు మంత్రులుగా పని చేసిన వారిలోనూ ఇలాంటి ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఉన్న అన్ని రిపోర్టులూ చంద్రబాబు అధికారంలోకి రావడం కష్టమని తేల్చేస్తున్న నేపథ్యంలో ఆ నేతలు తమ సొంత దారి చూసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్.
   
మే 23 ఫలితాల తరువాత టీడీపీ అధికారంలోకి రాకపోతే ఎలాంటి శషబిషలు లేకుండా నెల రోజుల్లో కండువా మార్చేసి ఫ్యాను కింద కూర్చోవాలని అనుకుంటున్నారట. అలా చేస్తేనే జగన్ మంత్రివర్గాన్ని విస్తరించేటప్పుడు తమకు చాన్సు దొరకొచ్చని అనుకుంటున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇప్పటికే ఇలాంటి ఆలోచనలో ఉన్నారట. అందుకే... ఒకప్పుడు జగన్‌ పై ఒంటి కాలిపై లేచిన ఆ నేతలు ఇప్పుడు ఒక్క మాట కూడా అనడం లేదని సమాచారం.
   
ఇక... గోదావరి జిల్లాల్లోనూ ఇలాంటి ఆలోచనలో ఉన్న నేతలున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి చెందిన సుమారు 20 మంది నేతలు వైసీపీలోకి ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారట.. తాము వ్యక్తిగతంగా గెలిచినా టీడీపీ అధికారంలోకి రాకపోతే మాత్రం వీరంతా గోడ దూకడం ఖాయమని సమాచారం.
Tags:    

Similar News