తాజాగా స్పీకర్ ఇంటి ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేయటం తెలిసిందే. అనంతరం స్పీకర్ ను తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన.. తలసాని వ్యవహారంపై స్పీకర్ మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
తలసాని రాజీనామా తనకు చేరిందని స్పీకర్ చెప్పారని.. నిర్ణయం రెండు రోజుల్లో ఉంటుందని చెప్పారని వ్యాఖ్యానించారు. స్పీకర్ చెప్పిన మాటలు తమకు సంతోషాన్ని కలిగించాయని.. ఆయన మాటల్ని విశ్వసిస్తున్నట్లుగా దయాకర్ రావు చెప్పారు.
స్పీకర్ ఇంటి ముందు ఆందోళన చేసి.. స్పీకర్ తో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కూల్ కావటం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ చెప్పినట్లుగా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన మాటకు తగ్గట్లే తలసాని వ్యవహారంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. ఒకవేళ అదే జరిగితే సంచలనం ఖాయమని చెబుతున్నారు. తలసాని రాజీనామాపై ఉత్కంట తీరాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.