మొహమాటం వదిలేశారు. తమను విమర్శిస్తే పవన్ ను అయినా వదిలిపెట్టమన్నట్లుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహారం కనిపిస్తోంది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణకు సంబంధించి ఇంతకాలం భూసమీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా భూసేకరణలోకి షిఫ్ట్ కావటం తెలిసిందే.
రాజధాని శంకుస్థాపనకు రోజులు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో భూసేకరణ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కారు రైతుల నుంచి బలవంతంగా అయినా భూములు సేకరించేందుకు సిద్ధం అవుతోంది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూముల సేకరణ విషయంలో రైతులకు ఇష్టం లేకుండా చేయొద్దని ఆయన ఇప్పటికే చెప్పటం.. పంటలు పండించే పొలాల్ని వదిలేయాలని సూచించటం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా తీసుకొని ఈ అంశంపై తరచూ తన వాదనను వినిపిస్తున్న పవన్‌కు.. మొన్న ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇవ్వటం.. దానికి పంచ్ ఇస్తూ గురువారం పవన్ కల్యాన్ స్పందించటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. శుక్రవారం తెలుగు తమ్ముళ్లు ఇద్దరూ పవన్‌ను బాహాటంగానే విమర్శించేశారు. భూసేకరణ చట్టంపై పవన్ కల్యాణ్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప వ్యాఖ్యానిస్తే.. ఆ వ్యాఖ్యకు కొనసాగింపుగా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సైతం వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
పవన్ కల్యాణ్ మీద తమకు గౌరవం ఉందని. .కాకుంటే తమ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందంటూ చురకలేశారు. మొత్తం వ్యవహారాన్ని స్టడీ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ సలహాలిస్తే.. వాటిని స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. పవన్ విషయంలో ఇప్పటివరకూ తొందరపడని సోమిరెడ్డి సైతం చురకలు వేసిన నేపథ్యంలో.. పవన్‌ను తమ్ముళ్లు అనటం పూర్తయిందని చెప్పొచ్చు. ఇక.. తమ్ముళ్లు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరుగా పవన్ ట్వీట్లు ఇవ్వటమే మిగిలింది. మరి.. పవన్ ఎప్పుడు స్పందిస్తారో..?