నీకంటే మేధావి ఎవరు నారాయణా..?

Update: 2015-08-08 09:26 GMT
ముందొచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు.. ఏపీ మంత్రివర్గంలో  ఓ మంత్రిని చూసి మిగతా మంత్రులంతా చాలాకాలంగా అదే మాట అంటున్నారు. పార్టీలో సభ్యత్వం లేకుండా ఒక్కసారి స్టారయ్యారాయన... ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వంటి హోదాలేమీ లేకుండానే నేరుగా మంత్రి కూడా అయిపోయారు.. ఆ తరువాత తప్పనిసరి కాబట్టి ఎమ్మెల్సీ ని చేశారు.. ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆయన్ను తప్ప ఇంకెవరినీ నమ్మే పరిస్థితి లేదు... ఆయనంతటి మేధావి ఇంకెవరూ లేరన్నట్లుగా ప్రతి పనికీ ఆయన్నే కీలంగా మార్చారు. రాజకీయాల్లో అనుభవం లేదు.. పాలన లో అనుభవం లేదు... ఏమీ లేకపోయినా కీలకమైన రాజధాని బాధ్యతలు ఆయనకే అప్పగించారు... అంతేకాదు మొన్నటిమొన్న మెగా ఈవెంట్ గోదావరి పుష్కరాల నిర్వహణలోనూ ఆయనే ప్రధాన సూత్రధారి. శాఖ ఏదైనా.. మంత్రి ఎవరైనా సరే... వాళ్లను సెకండరీ చేస్తూ చంద్రబాబు సదరు మంత్రివర్యులకు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తున్నారని చాలాకాలంగా మిగతా మంత్రులంతా గుర్రుమంటున్నారు.

ఆ మంత్రి ఇంకెవరో కాదు... పురపాలక అమాత్యులు పి.నారాయణ. ఇప్పుడాయన నవ్యాంధ్ర  రాజధాని నిర్మాణ బాధ్యత నెత్తినేసుకుని అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా ఆయన    నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మేధావుల సలహాలు, సూచనల ను పాటిస్తామని.. అందరూ సలహాలు ఇవ్వండంటూ పిలుపునిచ్చారు. దీనికి టీడీపీ వారే కౌంటర్లేస్తున్నారు. 'నీ కంటే మేధావులు ఎవరున్నారు నారాయణా' అంటూ సెటైర్లు వేస్తున్నారు.  సింగపూర్‌ ప్రభుత్వం అందించిన మూడురకాల మాస్టర్‌ ప్లాన్‌ లపై శనివారం మంత్రి నారాయణ, సీఆర్‌ డిఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ తో కలసి మేథావులు, నిర్మాణ రంగ నిపుణులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ ఇలా మేధావుల నుంచి సూచనలు సలహాలు ఆహ్వానించారు.

కాగా మంత్రి నారాయణపై మిగతా మంత్రివర్గ సభ్యులు ఆగ్రహిస్తున్నారు. గతంలో ఓసారి చంద్రబాబు ఎదుట అంతా ఏకమై నారాయణకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఇందుకు కారణాలు కనిపిస్తున్నాయి. రాజధాని భూసేకరణ వ్యవహారాల్లో రెవెన్యూ మంత్రికి సంబంధం లేకుండా అంతా ఈయనే చూసుకున్నారు. అలాగే.. పుష్కరాల్లోనూ దేవాదామ మంత్రిని నామమాత్రం చేసి నారాయణే కథ నడిపించారు. ఇంకా అనేక అంశాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీంతో నారాయణ ఇలా మేధావుల నుంచిసలహాలు కావాలి అనేసరికి సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News