కలిసి రాని స్పీకర్‌ పదవి..కోడెల కథా అదే!

Update: 2019-03-14 09:58 GMT
సభాపతి.. విధానసభలో అధికార - ప్రతిపక్షాలకు పెద్ద. పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన పదవి. అయితే ప్రతిసారీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేను స్పీకర్‌ పదవిలో కూర్చోబెడతారు. అయితే ఇప్పటి వరకు స్పీకర్‌ పదవిలో కొనసాగిన వారు రాజకీయంగా ఎదిగిన దాఖలాలు లేవు. స్పీకర్‌ పదవి మినహా ఎలాంటి ఉన్నత పదవులు అధిరోహించలేదు. కేవలం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాత్రమే సీఎం పదవి వరకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన పరిస్థితి కూడా ఇదే కోవలోకే వస్తుంది.

సత్తెనపల్లి టికెట్‌ ‘కోడెల’కు వద్దు…

గత ఐదేళ్ల నుంచి తోపుడు బండి నుంచి పరిశ్రమల వరకూ ప్రతి దానికీ ‘కె’ ట్యాక్స్‌ వేస్తున్నారు. ఈ అక్రమ ట్యాక్స్‌ లు కట్టడం మా వల్ల కాదు. కోడెల అధికారంలో.. దూడల పెత్తనంతో మా పరిస్థితి దారుణంగా మారింది. కుక్కను నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తాం. అంతేకానీ కోడెల శివప్రసాద్‌ కు మాత్రం ఓటేయలేం. అని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. ఒకవేళ అధిష్టానం ఆయనకు టికెట్‌ ఇచ్చినా తాము వైఎస్సార్‌ సీపీ గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాద్‌ గెలిచిన నాటి నుంచి ఆయన కుమారుడు శివరామ్ - కుమార్తె విజయలక్ష్మి నియోజకవర్గంలో ఎవరినీ వదలకుండా ‘కె’ ట్యాక్స్‌ వసూలు చేశారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ వారని కూడా చూడకుండా లంచాలు వసూలు చేశారని మండిపడ్డారు. అయితే అధిష్టానం కోడెలకు ఇంకా సీటు ఖరారు చేయలేదు.

ఇది వరకూ.. రాజకీయంగా కనుమరుగైన స్పీకర్‌ లు..

నాదెండ్ల మనోహర్‌ - 2011 - 2014 (కాంగ్రెస్‌)(జనసేనలో హడావుడి చేస్తున్నారనుకోండి)

కిరణ్‌ కుమార్‌ రెడ్డి - 2009 - 2010 (కాంగ్రెస్‌)

కేతిరెడ్డి సురేష్‌ రెడ్డి - 2004  - 2009 (కాంగ్రెస్‌)

కావలి ప్రతిభా భారతి - 1999 - 2004 (టీడీపీ)

యనమల రామకృష్ణుడు - 1995 - 1999 (టీడీపీ)(వరస ఓటములతో పోటీ చేయడమే మానేశారు. నామినేటెడ్ పదవితో సాగుతూ ఉన్నారు. ఈయన తమ్ముడు కూడా పోటీ చేసి ఓడిపోయారు)
Tags:    

Similar News