టీడీపీ నుంచి కీలక నేతలు వైసీపీలో చేరడమన్నది ఇంకా ఆగలేదు. ప్రతి రోజూ ఎవరో ఒకరు చేరుతున్నారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రస్తుతం ఆ పార్టీ పద్దతులతో విసిగివేసారిపోయిన సీనియర్ నాయకులు వైసీపీలో వచ్చి చేరుతున్నారు. తాజాగా బుధవారం ఇద్దరు మహిళా నేతలు వైసీపీలో చేరబోతున్నారు.
టీడీపీని వీడుతున్న నాయకుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల కూడా ఆ లిస్టులో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈరోజు వీరిద్దరూ వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ బయలుదేరినట్టు సమాచారం.
శమంతకమణి, యామినీబాల తల్లీకూతుళ్లు. ఇద్దరికీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది. వీరిద్దరూ పార్టీని వీడబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లు పై ఓటింగ్ సమయంలో శమంతకమణి శాసనమండలికి గైర్హాజరయ్యారు. ఆ క్షణం నుంచే ఆమె పార్టీని వీడబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవల యామినీ బాలకు కూడా వైసీపీ నుంచి పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి నేడు జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో శింగనమల టికెట్ యామినీ బాలకు దక్కక పోవడంతో అప్పటి నుంచే ఆమె అసంతృప్తి తో ఉన్నారని.. ఇప్పుడు వైసీపీ నుంచి పిలుపు రావడంతో కార్యకర్తలతో మాట్లాడి తల్లితో సహా పార్టీ మారుతున్నారని తెలుస్తోంది.