ఆంధ్రప్రదేశ్ లో అరాచకం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు టార్గెట్ గా టీడీపీ చేస్తున్న దాడుల రాజకీయం గుబులు రేపుతోంది. అప్పట్లో తిరుమలకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై దాడులు మరిచిపోకముందే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించి రాళ్ల దాడి చేయడం కలకలం రేపుతోంది.
గుంటూరు జిల్లా కన్నవారితోటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇళ్లు ఉంది. ఉదయం కన్నాతోపాటు మరో ఇద్దరు మాత్రమే ఆ ఇంటిలో ఉండగా.. విజయవాడ నుంచి వచ్చిన టీడీపీ నేతలు కన్నా నివాసాన్ని ముట్టడించారు. నినాదాలు చేస్తూ బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో కన్నాతో సహా ఇద్దరు బీజేపీ నేతలు వారి ఎదురుగా కూర్చొని వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయినా టీడీపీ వారిని అదుపు చేయలేకపోవడంతో బీజేపీ యువమోర్చా నాయకులు వచ్చి టీడీపీ నేతలను తరిమికొట్టారు. టీడీపీ, బీజేపీ యువ మోర్చా నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో మరికొంత మంది పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.అనంతరం కన్నా ఇంటినుంచి వెళ్లిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరు లాడ్జిసెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు.
తనపై దాడిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. టీడీపీ గుండాలు తనను చంపడానికి పంపించారని ఆయన మండిపడ్డారు. దీనిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలే లేవని.. కేంద్రహోంమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు ఏపీలో తిరిగే పరిస్థితి లేదని.. వైఎస్ జగన్ ను కూడా చంపే ప్రయత్నం చేశారని కన్నా నిప్పులు చెరిగారు. తనను కూడా చంపేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. అనంతరం తన హత్యాయత్నానికి టీడీపీ నేతలు ప్రయత్నించారంటూ కన్నాతో పాటు బీజేపీ నేతలు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Full View