చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన వారిలో ఎనభై శాతం మంది ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గే అవకాశాలులేవని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు నుంచినే మంత్రులుకు ఎదురుగాలి ఉందనే సంకేతాలు చంద్రబాబుకే స్పష్టంగా అందాయట. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని - అందులోనూ మంత్రులపై వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉందని సర్వేలు స్పష్టం చేస్తూ వచ్చాయి.
అందులో భాగంగా పోలింగ్ తర్వాత పరిస్థితి పై కూడా అదే అభిప్రాయాలే వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన వారిలో ఎనభై శాతం మంది ఓడిపోతారు అనేది బాగా వినిపిస్తున్న మాట. పోస్ట్ పోల్ చర్చల్లో ఈ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఓడిపోయే మంత్రుల జాబితాను ఒకసారి గమనిస్తే..నారా లోకేష్ బాబు. కాలువ శ్రీనివాసులు - భూమా అఖిలప్రియ - ఆదినారాయణ రెడ్డి - అమర్ నాథ్ రెడ్డి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - కేఈ కృష్ణమూర్తి తనయుడు - దేవినేని ఉమ - నిమ్మకాయల చిన్న రాజప్ప - శిద్ధారాఘవరావు - పి.నారాయణ - ప్రత్తిపాటి పుల్లారావు - గంటా శ్రీనివాసరావు - కొల్లు రవీంద్ర - చింతకాయల అయ్యన్నపాత్రుడు - పరిటాల సునీత తనయుడు వీళ్లందరికీ వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు పరిస్థితిని అర్థం చేసుకున్నారట వాళ్లంతా. దీంతో కనీసం వారు చంద్రబాబు నాయుడుకు మొహం కూడా చూపలేకపోతున్నారని సమాచారం. ఒక్క యనమల రామకృష్ణుడు మాత్రమే కొంచెం ధైర్యంగా బాబు వద్దకు వెళ్తున్నారట. మిగతా వాళ్లంతా ఓటమి భయంతో బాబుకు మొహం కూడా చూపలేకపోతున్నారని సమాచారం! ఈ మేరకు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు కథ ఎలా ఉంటుందో ఈ నెల 23 న తెలుస్తుంది!