నేనండి.. క్రిస్టియన్ ని. నా బ్యాగ్ లో తప్పనిసరిగా బైబిల్ ఉంటుంది అంటూ ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మాటలతో కూడిన ఒక పొట్టి వీడియో గడిచిన రెండు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. తన మతానికి సంబంధించిన వివరాలతో పాటు.. తన ఆసక్తులు.. తన ఆధ్యాత్మిక నమ్మకాల గురించి ఒక మహిళా టీవీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను ఫాలో అయ్యే ధర్మం గురించి అనిత వివరంగా వెల్లడించారు.
అయినా.. ఒక ఎమ్మెల్యే మతం ముచ్చట ఎందుకంటారా? పవర్లో ఉన్నప్పుడు కీలక విషయాల్ని మర్చిపోవటం.. ప్రజల మనోభావాలతో ఆడుకునే చంద్రబాబు చేసిన భారీ తప్పిదమే ఇలా మాట్లాడించేలా చేస్తుందని చెప్పాలి. కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఖాళీగా ఉంచి.. సుదీర్ఘంగా కసరత్తు జరిపిన చంద్రబాబు.. ఎట్టకేలకు ప్రకటించిన బోర్డు సభ్యుల ప్రకటనపై తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ బోర్డు సభ్యులకు ఉండే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని సభ్యుల్ని ఎంపిక చేయాల్సిన చంద్రబాబు.. ఏ మూడ్ లో ఉన్నారో కానీ.. కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా ఎంపిక చేశారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనితను బోర్డు మెంబర్ గా ఎంపిక చేయటంపై కోట్లాది మంది భక్తులు భగ్గుమనే పరిస్థితి. ఎమ్మెల్యే అనిత తాను క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతానని గతంలో ఒక వీడియోలో స్పష్టంగా చెప్పటమే కాదు.. తన బ్యాగ్ లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని చెప్పటం తెలిసిందే.
తాను అనుసరించే మతం విషయంలో క్లియర్ గా ఉండే అనిత లాంటి నేతలకు టీటీడీ బోర్డు మెంబర్ షిప్ ఎలా ఇస్తారు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా అనితకు అవకాశం కల్పించటంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. తాను ఆచరించే మతం విషయంలో గతంలో ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి బయటకు రావటమే కాదు.. వైరల్ కావటంతో ఆమె ఇరుకున పడ్డారు. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఆమె తన మనసు మార్చుకున్నారు.
ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధినేత ఎంపికకు థ్యాంక్స్ చెప్పిన అనిత.. తనను టీటీడీ సభ్యురాలిగా తప్పించాలని కోరుతూ తాజాగా ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం బాబుకు ఒక లేఖ రాశారు. తాను హిందువునేనని.. తన కులం ఎస్సీ అని తిరుమల శ్రీవేంకటేశ్వరుడు తన ఇష్టదైవమని సదరు లేఖలో రాశారు. అయితే.. ఈ విషయంలో కొందరువివాదం కల్పిస్తూ.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా బోర్డు సభ్యుల ఎంపిక చేశారన్న విమర్శల నేపథ్యంలో తనను కమిటీ నుంచి తప్పించాలని కోరుతున్నట్లుగా ఆమె లేఖ రాశారు. ఓపక్క తాను అనుసరించే మతానికి సంబంధించి క్లియర్ గా ఉన్న తన మాటల వీడియో వైరల్ అయ్యాక కూడా కవరింగ్ మాటలేంది అనితమ్మ? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్యమతస్తులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించటం ఏ మాత్రం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి బాబు చేసిన తప్పును అనితమ్మ సమయానికి స్పందించి.. డ్యామేజ్ కంట్రోల్ చేశారని చెప్పక తప్పదు. బాబు ఇమేజ్ కాపాడే క్రమంలో.. తన ఇమేజ్ ను ఎమ్మెల్యే అనిత దారుణంగా దెబ్బ తీసుకున్నారని చెప్పక తప్పదు.