త‌మ్ముళ్ల చిందులాట‌!..చూసి తీరాల్సిందే!

Update: 2019-01-01 17:01 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేత‌ల ఆట‌ల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంద‌ని విప‌క్షం వైసీపీతో పాటు ఇత‌ర పార్టీల నేత‌లు కూడా ఒక్కుమ్మ‌డిగా ఆరోపిస్తున్న వైనం మ‌న‌కు తెలిసిందే. అవినీతి ఆట‌లే కాకుండా అమ్మాయిల‌తో చిందులాట‌ల్లోనూ త‌మ‌కు తామే సాటి అన్న రీతిలోనూ వ్య‌వ‌హ‌రిస్తున్న తెలుగు త‌మ్ముళ్ల వ్య‌వ‌హారం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ప్ర‌తి విష‌యంలోనూ త‌మదైన మార్కు పాల‌న‌తో ముందుకు సాగుతున్న టీడీపీ ప్ర‌భుత్వం... త‌మ పార్టీ అనుచ‌రుల‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఇత‌ర పార్టీల‌కు చెందిన వారిని క‌నీసం ఆయా సంక్షేమ ప‌థ‌కాల ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా త‌మ ప‌ని త‌మ‌దేన‌న్న రీతిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సాగుతుండ‌గా - ప్ర‌భుత్వ‌మే విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను ప‌ట్టించుకోన‌ప్పుడు మ‌న‌ముందుకు ప‌ద్ద‌తి మార్చుకోవాల‌న్న రీతిలో తెలుగు త‌మ్ముళ్లు కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు లేక‌పోలేదు.

అంతేకాకుండా... కొన్ని చ‌ర్య‌ల‌తో తెలుగు త‌మ్ముళ్లు త‌మ ప‌రువునే కాకుండా పార్టీ ప‌రువును కూడా ఏకంగా బ‌జారుకీడ్చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - వృద్ధ నేత‌... ఏకంగా పార్టీ కార్యాల‌యంలోనే ఓ యువ‌తిలో రాస‌లీల‌లు సాగిస్తూ కెమెరా కంటికి అడ్డంగా బుక్కైపోయారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఇంకో జిల్లా కు చెందిన ఎమ్మెల్యే - ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం కూడా బ‌జారున ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌ గా మారిపోయింది. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... ప్రకాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబురావు స‌మ‌క్షంలో జ‌ర‌గ‌డం విశేషం. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని జ‌రిగిన వేడుక‌లో టీడీపీ నేత‌లు... త‌మ స్థాయి మ‌రిచి లేడీ డ్యాన్స‌ర్ల‌తో స్టెప్పులు ఇర‌గ‌దీసేశారు.

 ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌజ్‌ లో జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గెస్ట్‌ హౌజ్‌ లో పార్టీని ఏర్పాటు చేశారు. స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం ఓ రికార్డింగ్ డాన్స్‌ ట్రూప్‌ ను కూడా రప్పించారు. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఎదురుగానే.. పార్టీకి చెందిన నేత‌లు అమ్మాయిలతో కలిసి చిందులేయడం ప్రారంభించారు. టీడీపీ నేతలు భేరి పుల్లారెడ్డి - మున్సిపల్‌ చైర్మన్‌ చిన్న మస్తాన్‌ కూడా అమ్మాయిలతో చిందులేసిన వారిలో ఉన్నారు. బాధ్యతగల నేతలై ఉండి.. కనీస పద్ధతి పాటించకుండా వ్యవహరించిన టీడీపీ నేతల వైఖరిపై అక్కడికి వచ్చినవారంతా ముక్కున వేలేసుకున్నారు.


Full View
Tags:    

Similar News