రాజకీయాల్లో మాట అనటం మామూలే. అయితే.. తెలంగాణలో వెనుకటి పరిస్థితుల్లేవు. ఏ రోజు ఎలా మారుతుందో ఎవరూ కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే.. నోరు విప్పి నాలుగు మాటలు అనే ముందు.. ఘాటైన వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుమార్లు వెనుకా ముందు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ తెలంగాణ శాఖ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు తెలంగాణ తమ్ముళ్లు ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలా ఫైర్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే సీతక్క ఒకరు. తెలంగాణలో పార్టీని లేకుండా చేయాలని టీఆర్ ఎస్ ప్రయత్నిస్తుందని.. అలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
కొందరు నేతలు కోవర్టులుగా మారి.. పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్నారని.. వారు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయినా.. పార్టీ క్యాడర్ మాత్రం బలంగా ఉందంటూ సీతక్క వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు అని చెబుతూ అధికారపార్టీలో చేరటం సిగ్గుచేటు చర్యగా అభివర్ణించిన సీతక్కను.. విమర్శలు చేసే విషయంలో ఆచితూచి మాట్లాడాలంటూ సలహా ఇస్తున్న మాజీ తమ్ముళ్లు. ఏ రోజు ఎలా ఉంటుందో..? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ ఎస్ మినహా తెలంగాణలో మరో దిక్కు లేదు.. అలాంటి పరిస్థితుల్లో పార్టీ మారే సమయంలో.. గతంలో చేసిన మాటలు నేతల వెంటే ఉంటాయని.. అందులోకి మాజీలైన సీతక్క లాంటి వారికి అవకాశాలు రాకుండా చేస్తాయంటూ సీనియర్ తమ్ముళ్లు తమకు తోచిన సలహాను ఇస్తుండటం కనిపిస్తోంది.