తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ ఒకప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు కేబినెట్లోనూ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయనకే ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ - వైసీపీల్లో తెలియని నాయకుడే లేరు. పలువురు టీడీపీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. తాజాగా ఆయన టీడీపీకి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును కలిశారు. త్రిమూర్తులు కుమారుడి వివాహ రిసెప్షన్ ఉండడంతో తలసాని దానికి అటెండయ్యారు. ఇదంతా వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో జరిగిందే అయినా ఎన్నికల సీజన్ కావడంతో దీనికి రాజకీయ కలర్ అంటుకుంటోంది. వైసీపీ - టీఆరెస్ మధ్య మంచి సంబంధాలున్నాయని.. త్రిమూర్తులును వైసీపీలోకి పంపించేందుకు కేసీఆర్ తలసానిని రాయబారానికి పంపించారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా త్రిమూర్తులు టీడీపీలో ఇమడలేకపోతున్నారన్నది.. వైసీపీతో టచ్ లో ఉన్నారన్నది వాస్తవమేనంటున్నారు ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు.
టీడీపీలో సీనియర్ నేతల్లో ఒకరైన త్రిమూర్తులుకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. పైగా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో... టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే త్రిమూర్తులు కూడా వైసీపీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తలసాని కూడా ప్రోద్బలం చేస్తున్నారని చెబుతున్నారు.
అయితే.. త్రిమూర్తులు మాత్రం తాను టీడీపీని వీడడం లేదనే చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీలోకి వెళ్లిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ - అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ లు తనకు మంచి మిత్రులే అయినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటానంటున్నారు. స్నేహం వేరు, రాజకీయాలు వేరు అని ప్రస్తుతానికి చెబుతున్నారు.
ప్రస్తుతం జగన్ లండన్ టూర్లో ఉండడంతో ఆయన వచ్చేవరకు ఇలానే ఉంటుందని... ఆ తరువాత సీను మారుతుందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు చెప్పుకొంటున్నారు. తోట త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్లడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ జరిగిపోయానని చెబుతున్నారు.