చంద్రబాబునాయుడంటే తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేత. కానీ, సీనియర్ నేతల్లో కొందరు మాత్రం పార్టీలోని కొన్ని వ్యవహారాలపై చంద్రబాబును చూసుకుని ఆయన కోటరీ చేసే వ్యవహారాలపై - అధికార గణం తీరుపై మండిపడుతున్నారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూనే నిరసనా ప్రకటిస్తున్నారు. తిరుపతి - కర్నూలు - శ్రీకాకుళం... ఇల్లా రాష్ట్రం నలుమూలలా సీనియర్ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ రెండు కార్యాక్రమాల్లో చంద్రబాబు వచ్చే వరకు ఉండి.. ఆయన రాగానే వెళ్లిపోయి నిరసన తెలిపారు.
శ్రీకాకుళం అంబేద్కర్ వర్సిటీలో నిర్వహించిన బహిరంగ సభకు చంద్రబాబు కంటే ముందే వచ్చి వేదికపై కూర్చుని.. చంద్రబాబు రాగానే లేచి వెళ్లిపోయారాయన. అలాగే... తమ్మినాయుడుపేట వద్ద చంద్రబాబు నాగావళి నదికి జలహారతి ఇవ్వడానికి వెళ్లగా అంతకంటే ముందే శివాజీ అక్కడకు చేరుకున్నారు. కానీ, చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన్ను అనుమతించలేదు.. దీంతో శివాజీ ఆగ్రహంగా అక్కడనుంచి వెళ్లిపోయారు. అయితే... శివాజీని తన భద్రతాసిబ్బంది అనుమతించని విషయం తెలుసుకున్న చంద్రబాబు వారిని మందలించినట్లు చెబుతున్నారు. కాగా... గతంలో ఏపీ సెక్రటేరియట్ వద్ద కూడా ఎమ్మెల్యే శివాజీని అనుమతించకపోవడంతో ఆయన అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు.
మొన్న చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లినప్పుడు అక్కడి ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరయ్యారు. మహా సంప్రోక్షణ సమయంలో ఆమెను తిరుమలలోకి అనుమతించకపోవడంతో ఆ విషయంలో ఆగ్రహించిన ఆమె చంద్రబాబు పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు.
ఇక కర్నూలు జిల్లాలో అయితే అక్కడి నేతలు భారీ షాకిచ్చారు చంద్రబాబుకు. జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు శ్రీశైలం వెళ్లగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక - రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ హాజరుకాలేదు. అదే విధంగా ఎంఎల్ ఏలు బిసి జనార్ధన రెడ్ది - బివి జయనాగేశ్వర్ రెడ్డి - భూమా బ్రహ్మానందరెడ్డి కూడా డుమ్మా కొట్టారు. ఎంఎల్సీ - ఏపిఐడిసి ఛైర్మన్ - ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సోదరుడు కెఇ ప్రతాప్ కూడా గైర్హాజరయ్యారు. ఒకేసారి ఇంతమంది ప్రముఖులు గైర్హాజరవడంతో ఏం జరిగిందో చంద్రబాబుకు అర్థం కాలేదట. దీంతో ఎంఎల్ ఏలు - ఎంఎల్సీ తమ నియోజకవర్గంలో జరిగిన జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనటంలో బిజీగా ఉండి రాలేకపోయారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. మరి... రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ - ఎంఎల్సీ కెఇ ప్రతాప్ ఏ నియోజకవర్గంలో జలసిరికి హారతిచ్చారో తెలియదు.
అసలు విషయం ఏమిటంటే - కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కొడుకు టిజి భరత్ ను పోటీ చేయించాలని వెంకటేష్ ప్రయత్నిస్తున్నారు. అందుకు లోకేష్ అడ్డుగా ఉన్నారు. కాబట్టి వెంకటేష్ హాజరుకాలేదు. ఇక, పేరుకు ఉపముఖ్యమంత్రే అయినా కృష్ణమూర్తి కి ప్రోటోకాల్ తప్ప ఇంకేమి అందటం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో సోదరునికి జరుగుతున్న అవమానానికి తమ్ముడు ప్రతాప్ మండిపోతున్నారు. అందుకని ప్రతాప్ డుమ్మా కొట్టారట. మొత్తానికి సీనియర్ నేతలు ఇలా చంద్రబాబుపై నిరసన తెలపడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.