నారా లోకేష్ రెండు శాతం ఇంప్రూవ్ అయ్యాడా?

Update: 2019-07-31 14:30 GMT
తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విటర్లో హడావుడి చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఇప్పటికీ చేయడం లేదు లోకేష్ బాబు. అలాగే జనం ముందుకు వచ్చి కూడా మాట్లాడటం లేదు.శాసనమండలిలో కూడా అధికారం కోల్పోయాకా కేవలం ఒక్కసారే ప్రసగించాడు. అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే.

ఆ ప్రసంగం కూడా బట్టీ పట్టి చదివారు. ఇక లోకేష్ ట్విటర్ ను ఎవరు మెయింటెయిన్ చేస్తున్నారో కానీ..పెద్ద పెద్ద పదాలే వాడుతున్నారు. అయితే ఆ ట్వీట్లు అప్పుడప్పుడు సెల్ప్  గోల్ప్ అవుతున్నాయి. అవి తెలుగుదేశం పార్టీకే పంచ్ లుగా  మారుతున్నాయి.

ఇలా సాగుతోంది లోకేష్ కథ. ఈ అంశం మీదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్యన చర్చ జరిగిందట. అసెంబ్లీ లాబీల్లో ఈ అంశం గురించి మాట్లాడుకున్నారట తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఈ చర్చకు కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యే అని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే 'ఏమయ్యో మీ లోకేష్ ఇంప్రూవ్ అవుతున్నట్టున్నాడే..' అని అన్నాడట. ఆ మాటకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిర్వేదంగా స్పందించారట. 'ఏం ఇంప్రూవ్ కావడమో.. అయ్యుంటాడు రెండు శాతం.' అని అన్నారట ఆ ఎమ్మెల్యే.' 'ఆయన ఏం ఇంప్రూవ్ అవుతాడో.. నోరే తిరగదు పాపం..' అంటూ మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా.. టీడీపీ ఎమ్మెల్యేలే ఆ అంశంపై భల్లున నవ్వారట!
Tags:    

Similar News