తెలుగుదేశం పార్టీకి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి అలియాస్ రవీంధ్రనాథ్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఉన్న బీటెక్ రవిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
‘చలో పులివెందుల’ కార్యక్రమం నేపథ్యంలో బీటెక్ రవి, మరికొందరిపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ నాగమ్మ హత్యపై సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ తాజాగా ‘చలో పులివెందుల’ కార్యక్రమాన్ని చేపట్టింది. అసలైన నిందితులను వదిలేశారని ప్రచారం జరగడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిసెంబర్ 19న బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది.
అయితే నాగమ్మ హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేశారని.. టీడీపీ నేతలు మాత్రం తమ పరువుకు భంగం కలిగేలా ర్యాలీ తీశారని బాధిత మహిళ కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు డిసెంబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీటెక్ రవి సహా 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.ఈ కేసులో భాగంగానే చెన్నైలో ఉన్న బీటెక్ రవిని ఏపీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
బీటెక్ రవితోపాటు ఈ కేసులో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేత శ్రీరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి - ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు - టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి - హరిప్రసాద్ - గోవర్ధన్ రెడ్డితో పాటు విజయకుమార్ రెడ్డి - గురప్ప - జయచంద్ర - హరిక్రిష్ణ - జింకా శ్రీను - బండి జయశేఖర్ - అశోక్ - కుళ్లాయప్ప - సుదర్శన్ - నారాయణ తదితరులపై పోలీసులు కేసు పెట్టారు. వారిపై విచారణ సాగుతోంది.