రూ.15 వేల కోట్ల భూక‌బ్జా!

Update: 2017-06-08 16:00 GMT
ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి - లాయర్ శైలేష్‌ సక్సేనా భూ అక్రమాలపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించారు. వీరిద్ద‌రూ చాలా కాలంగా త‌ప్పుడు పత్రాలతో హ‌క్కుదారులను బెదిరిస్తున్నారని బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. న‌కిలీ ప‌త్రాల ద్వారా కోర్టుల‌ను ఆశ్రయించి ఆ భూముల‌కు అధికారికంగా ఉత్తర్వులు సంపాదించుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ బృందంపై సీసీఎస్‌ లో పలు కేసులు ఉన్నట్లు అదనపు డీసీపీ జోగయ్య తెలిపారు.

గుడిమల్కాపూర్‌ లో ఉన్న 45 ఎకరాలకు పైగా మిగులు భూమిలో ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కోసం 13 ఎకరాల‌ను కేటాయించింది. అక్క‌డ‌కు వెళ్లిన రెవెన్యూ అధికారులను శైలేంద్ర సక్సేనా అండ్‌ కో అడ్డుకుంది. ఆ భూమి త‌మ‌దేన‌ని శైలేంద్ర సక్సేనా అండ్‌ కో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  వివాదం కోర్టులో ఉండగానే ఇతర భూములను కూడా వారు దర్జాగా విక్రయించారు.

కొన్ని లావాదేవీల‌కు  సంబంధించి శైలేంద్ర సక్సేనా అండ్‌ కోలో భేదాభిప్రాయాలు వచ్చాయి. శైలేంద్ర త‌ప్పుడు డాక్యుమెంట్లు, భూ కబ్జాల గురించి అత‌డి మిత్రుడు శ్రీనివాస్ క‌లెక్ట‌రేట్ లో ఫిర్యాదు చేశాడు. అతడు చేస్తున్న మోసాలపై ఆరు పేజీలతో నోట్‌ తయారు చేసి అధికారులకు సమర్పించాడు.

 దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తులను దాదాపు రూ.7,000 కోట్లుగా చూపించారు. అంతేకాదు, 2012 అఫిడవిట్లో ఏడాదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు చూపించారు. కాగా, దీపక్ రెడ్డి భూకబ్జా చేసిన ఆస్తుల విలువ‌ రూ.15వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News