ఏపీ అధికారపక్షానికి చెందిన ఎంపీ (రాజ్యసభ సభ్యుడు).. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ఆరాచకం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడన్న ట్యాగ్ లైన్ తో తరచూ చెలరేగిపోయే సీఎం రమేశ్.. తాజాగా ఒక లైన్ మ్యాన్ మీద తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. ఈ ఉదంతం ఎలా చోటు చేసుకుందంటే..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలోని సత్యానారాయణ కాలనీలో విద్యుత్ వైర్లకు అడ్డం వస్తున్న చెట్ల కొమ్మల్ని కొడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి డ్రైవ్ ను అప్పుడప్పుడు చేసే విషయం తెలిసిందే. విద్యుత్ సరఫరాలో చోటు చేసుకునే అంతరాయాన్ని అడ్డుకునేందుకు ఇలాంటి చర్యలు చేపడతారు.
అయితే.. తాజా ఉదంతంలో పొట్లదుర్తి విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్ మన్ దండు వీరశేఖర్.. సబ్ స్టేషన్ వాచ్ మన్ నాగయ్య.. అంజి..భాస్కర్ లు చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్నారు. ఆ టైంలో అటుగా వచ్చిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్.. అసిస్టెంట్ లైన్ మన్ ను పిలిచి.. చెట్ల కొమ్మల్ని తొలగించారెందుకంటే ఫైర్ అయ్యారు. ఏ నేపథ్యంలో చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్నారో వివరించే ప్రయత్నంగా చేయగా.. తన మాట వినటం లేదన్న ఆగ్రహంతో పిడికిలి బిగించి ముఖం మీద కొట్టినట్లుగా చెబుతున్నారు. దీంతో.. లైన్ మ్యాన్ ముక్కుకు గాయమై.. రక్తం వచ్చింది. ఊహించని పరిణామంతో గాయాలపాలైన వీరశేఖర్ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఒక చిరుద్యోగిపై అసహనంతో సీఎం రమేశ్ దాడి చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయినా.. చిన్నోళ్ల మీద ఈ ప్రతాపం ఏంది ఎంపీగారు అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/