తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులకు - టీడీపీ నేతలకు మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రమణ దీక్షితులును టార్గెట్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు....ఆయనపై నానా బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తన వాదనను చంద్రబాబుకు వినిపించేందుకు రమణదీక్షితులకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని సంగతి తెలిసిందే. దీంతో, రమణ దీక్షితులు...ప్రతిపక్ష నేత జగన్ ను కలిసి న్యాయం చేయాలని కోరారు. రమణ దీక్షితులుకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా, రమణ దీక్షితులుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో రమణ దీక్షితులు .....ఇపుడు చేస్తోనన ఆరోపణలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అపుడు రమణదీక్షితులు గాడిదలు కాస్తున్నారా అంటూ అసభ్యకరరీతిలో విమర్శలు గుప్పించారు.
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు.... ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా జేసీ పేరు తెలియని వారుండరు. తన వివాదాస్పద వ్యాఖ్యలు - చర్యలతో నిత్యం వార్తల్లో నిలవడం జేసీకి అలవాటు. కొద్ది రోజుల క్రితం జరిగిన మహానాడులో సాక్ష్యాత్తూ తమ పార్టీ అధ్యక్షుడు - సీఎం చంద్రబాబుపైనే విమర్శలు గుప్పించిన ఘనత జేసీది. తోచినట్లుగా ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడడం....వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సొంత పార్టీలోనే ఆయనపై కొందరు అసంతృప్తితో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా, జేసీ చేసిన వ్యాఖ్యలు ఆయన దుందుడుకు వైఖరికి నిదర్శనం. పదవిలో ఉన్నపుడే రమణ దీక్షితులు...ఈ అవకతవకలపై స్పందించి ఉండాల్సిందని - అపుడు ఆయన మాటలను ప్రజలు వినేవారని - నమ్మేవారని జేసీ అన్నారు. ఆనాడే ఆ విషయాలు చెప్పాల్సిన బాధ్యత లేదా? నిద్ర పోయావా? గాడిదలు కాస్తున్నావా? అంటూ అసభ్యకర రీతిలో రమణ దీక్షితులునుద్దేశించి జేసీ వ్యాఖ్యానించారు. దేవుడి సేవలో చాలా ఏళ్లు గడిపిన రమణ దీక్షితులు ఆ విషయాలు ఇన్నాళ్లూ చెప్పలేదంటే ...దొంగ స్వామి లేదా ఆ అవకతవకల్లో భాగస్వామి అయి ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఒక బజారు వ్యవహారమని జేసీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జేసీ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన టీటీడీలో జరిగిన అవకతవకలను - ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిన రమణ దీక్షితులుపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ప్రతిపక్ష నేత మద్దతు పలికిన మరుసటి రోజే జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు - జేసీలు అంత నిజాయితీపరులైతే....రమణ దీక్షితులు కోరినట్లు ఆ ఆరోపణలపై సీబీఐ విచారణ ఎందుకు వేయరని మండిపడుతున్నారు. జన్మభూమి కమిటీలు - టెలీ కాన్ఫరెన్స్ ల గురించి చంద్రబాబును నిలదీసిన జేసీ.....సీబీఐ విచారణపై చంద్రబాబును ఎందుకు నిలదీయరని నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబును ప్రశ్నించి జేసీ తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచిస్తున్నారు. అయినా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే జేసీ.....రమణ దీక్షితులుపై ఆరోపణలు చేయడం విడ్డూరమని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.