ఆసక్తికర పోస్టులతో అదరగొట్టేస్తున్నారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. పార్టీకి డ్యామేజ్ చేసేలా ఆయన చేస్తున్న పోస్టులు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటిగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్యన తనకు పదవిని కట్టబెడుతూ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మీద ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించటంతో పాటు.. కేశినేనికి సంబంధించి ఏదో లెక్క తేడా వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
గడిచిన కొద్ది రోజులుగా ఆయన తీరు కాస్త బిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన పార్టీ మారుతున్నట్లుగా కొందరు చెబుతున్నారు. అయితే.. తాను పార్టీ మారటం లేదన్న మాటను కేశినేని నాని చెబుతున్నప్పటికీ.. ఆయన ఫేస్ బుక్ లో చేస్తున్న పోస్టు చూసినోళ్లు మాత్రం ఏదో లెక్క తేడా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
తాజాగా కేశినేని చేసిన షాకింగ్ పోస్టు విషయానికి వస్తే.. కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని పోస్ట్ చేశారు. ఈ పోస్టు అంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేవినేని అవినాష్ పై పోటీకి దిగిన కొడాలి నాని విజయాన్ని సాధించటమే కాదు.. ఏకంగా జగన్ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు.
అంతర్గత కలహాలతోనే దేవినేని అవినాష్ ఓటమి పాలైనట్లుగా ఒక చర్చ నడుస్తోంది. ఇలాంటివేళలో కేశినేని నాని చేసిన ఫేస్ బుక్ పోస్టు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారా? అన్నది ప్రశ్నగా మారింది. కేశినేని నాని పెట్టిన పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకుసార్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు? కొంచెం హుందాగా ఉండండి సార్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి కేశినేని నాని సాఫ్ట్ వేర్ లో ఏదో తేడా కొడుతోందని.. ఆయన తీరు రోటీన్ కు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన మీద ఎవరైనా ఏదైనా కామెంట్ చేసినంతనే రియాక్ట్ అయ్యే కొడాలి నాని.. ఇప్పటివరకే కేశినేని నాని పోస్ట్ పై స్పందించకపోవటం గమనార్హం.