అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రధాని మోడీపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలోనే గొప్ప నటుడు మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. గొప్ప నటన.. నాటకీయత.. హావభావాలతో ఆయన ప్రసంగం సాగిందన్నారు.
అవిశ్వాసం ప్రవేశ పెట్టిన టీడీపీ.. మోడీ సమాధానం తర్వాత రైట్ టు రిప్లై కింద నాని మాట్లాడారు. 2014కు ముందు కూడా మోడీ ఇదే తీరులో నటించారన్న ఆయన.. మోడీది గొప్ప నటన.. నాటకీయత.. హావభావాలతో ఆయన ప్రసంగం సాగింది. ప్రధాని స్పీచ్ చూస్తే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తలపించిందన్నారు.
ప్రధాని సమాధానం తర్వాత ఏపీకి ఎలాంటి హామీలు నేరవేర్చే అంశం లేదన్నారు. దాదాపు గంటన్నర పాటు తాను బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా చూసినట్లుగా భావించినట్లు నాని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఉత్తమ నటుడు అనే దాన్లో మోడీ ఎలాంటి అనుమానం లేదన్న ఎద్దేవా చేసిన ఆయన.. ప్రధానిపై విరుచుకుపడ్డారు. నాని సమాధానం అనంతరం ఓటింగ్ జరగటం.. అందులో మోడీ సర్కారు స్పష్టమైన అధిక్యత నమోదైంది.
మోడీపై పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు.. వ్యతిరేకంగా 325 మంది ఓట్లు వేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై దాదాపు పన్నెండు గంటల పాటు చర్చ జరిగింది. ఒకసారి వాయిదా పడగా.. మూడు.. నాలుగు సార్లు మాత్రం సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీ గల్లా జయదేవ్.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ మాట్లాడే సందర్భంగా సభలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. ఇది మినహా మిగిలిన సమయమంతా ఎలాంటి ఆటంకాలు లేకుండానే సభ సాగింది. కానీ కేశినేని నాని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మోడీ నటుడు అయితే బాబు ఎంత పెద్ద స్టార్ నటుడు మరియు మీరంతా ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు