ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ అనుచరులు అక్కడి సిబ్బందితో గొడవపెట్టుకున్నారు. అంబరీష్ బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో బాగేపల్లి టోల్ గేట్ వద్ద సిబ్బంది టోల్ రుసుము అడిగారు. అంబరీష్.. టోల్ రుసుము చెల్లించకుండా తాను ఎంపీ కుమారుడినని సిబ్బందితో చెప్పాడు. ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుందని.. ఎంపీ కుమారులకు ఉండదని సిబ్బంది చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టోల్ గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి.. తన అనుచరులకు ఫోన్ చేసి పిలిపించాడు. అంబరీష్ అనుచరులు అక్కడికి చేరుకుని సిబ్బందితో గొడవపెట్టుకున్నారు. అనంతరం టోల్ గేట్ క్యాబిన్ అద్దాలు - కంప్యూటర్లను ధ్వంసమయ్యాయి. అంబరీష్ అనుచరులు, కొందరు స్థానికులు వాటిని ధ్వంసం చేశారని భావిస్తున్నారు.