విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ ఒకరు జనసేనలోకి చేరుతారన్న ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయన విషయంలో ఇలాంటి ప్రచారం జరగ్గా ఆయన ఖండిస్తూ వస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన్ను గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఆ కారణంగా ఈ అయిదేళ్లలో తాను తీవ్రంగా నష్టపోయానన్న భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని తన పాత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నప్పటికీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
పైగా ఆ ఎంపీ సమీప బంధువు ఒకరికి జనసేనలో ఇప్పటికే కీలక బాధ్యత అప్పగించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎలాగైనా పోటీ చేయాలని.. అక్కడ పోటీ చేస్తేనే తన వ్యాపార సంస్థలను మరింత విస్తరించొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో ఇక అవకాశం లేదు కాబట్టి జనసేనకు వెళ్లడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం... ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ భారీ సంఖ్యలో కాపుల ఓట్లు ఉండడంతో ఆయన ఎన్నికల నాటికి ‘గాజు గ్లాసు’ గుర్తుతో పోటీ చేయాలని రెడీ అవుతున్నట్లు టాక్.
అయితే... ఈ ప్రచారం వెనుక టీడీపీ నేతల హస్తం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోరుతుండడంతో ఈ ఎంపీపై ఇలాంటి ప్రచారం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. జనసేనలోకి వెళ్తారని.. వైసీపీలోకి వెళ్తారని నిత్యం ప్రచారం చేయిస్తుండడంతో చంద్రబాబు వద్ద అన్ పాపులర్ అవుతారని.. అప్పుడు తన స్థానం కోసం బలంగా పోటీ పడలేరని ఆ మంత్రి ప్లాన్ చేసినట్లు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.