రాష్ట్ర విభజన సమయంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ను ఎవరూ మర్చిపోలేరు. నిత్యం ఏదో ఒక వేషం వేసి.. పార్లమెంటు దగ్గర షో నడిపించిన శివప్రసాద్ కారణంగా ఏపీకి ఎలాంటి ప్రయోజనం కలగకున్నా.. ఆయన ఇమేజ్ మాత్రం భారీగా పెరిగిందని చెప్పాలి. విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు ఎంపీ కష్టపడి వేషాలు కట్టటం అందరి దృష్టిని ఆకర్షించేది. కాకుంటే.. ఆయన ఎన్ని వేషాలు వేసినా.. విభజన కారణంగా ఏపీకి జరగాల్సిన నష్టంలో ఒక్క శాతాన్ని కూడా తగ్గించలేకపోయారు.
ఇదిలా ఉంటే.. విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన హామీపై కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంపీ శివప్రసాద్ అంబేడ్కర్ వేషం వేసి.. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యాసలో మాట్లాడిన ఆయన.. మోడీ సర్కారుపై సున్నితంగా చురకలు వేశారు.
అరేరే.. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుందా? నేను రాసిన రాజ్యాంగానికే విలువ లేదా? ఏపీ అభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడుతున్న చంద్రబాబుకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయా? ఊఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించలేదా? ఐదేళ్లు కాదు పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అంటూ బీజేపీ నేత వెంకయ్యనాయుడు చెప్పలేదా? అంటూ ప్రశ్నలు వేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. పార్లమెంటు దగ్గర తెలుగు తమ్ముడు వేసిన వేషాల్ని యూపీఏ సర్కారు లైట్ తీసుకుంది. మరి.. ఎన్డీయే సర్కారేం చేస్తుందో..?