తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన గో.పి తత్వాన్ని నిరూపించుకున్నారు. గతంలో బీజేపీతో పొత్తుల విషయంలో పలుమార్లు యూటర్న్ లు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా రికార్డ్ సృష్టించారు. ప్రత్యేక హోదా - ప్యాకేజీ - మళ్లీ ప్రత్యేక హోదా.. ఇలా రోజుకొక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు బీజేపీపై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారని స్పష్టమైంది. తాను నేరుగా వెళ్లలేక పార్టీ ఎంపీలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు పంపించి ఐస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారత మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా గుర్తించని సంగతి తెలిసిందే. అయితే, దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది. దీంతో మరో చిత్ర పటం విడుదల చేసి అందులో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించారు. ఈ సాకుతో కేంద్ర హోం శాఖా మంత్రి - బిజెపి అధినేత అమిత్ షా దృష్టిలో పడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ప్రత్యేకంగా ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే, అక్కడితో సరిపెట్టకుండా....ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ - రామ్మోహన్ నాయుడు తదితరులతో కేంద్ర హోం శాఖా మంత్రితో సమావేశం అయ్యేలా చేశారు. తాజాగా అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు ఈ మేరకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, చంద్రబాబు కంటే ఆయన పార్టీ ఎంపీలు మరింత లౌక్యులు అనే విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది. అమిత్‌షాతో సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించామని మీడియాకు తెలిపారు. ఆరు నెలల కిందట తనపై దుమ్మెత్తిపోసిన రాజకీయ పార్టీ నేతకు చెందిన ఎంపీలతో ఎవరైనా రాజకీయ పరిణామాలను చర్చిస్తారా? అందులోనూ...అమిత్ షా వంటి చాణక్యులు. తెలుగుదేశం నేతల డబ్బాలకు అడ్డూ అదుపు లేదంటు పలువురు కామెంట్లు చేస్తున్నారు.