చంద్రబాబునాయుడు తరఫున ఓ జట్టు ఇప్పుడు కేంద్రంతో బేరసారాలు సాగిస్తోంది. సుజనాచౌదరి, యనమల రామకృష్ణుడు, రామ్మోహన్ నాయుడు, కుటుంబరావు ఈ జట్టులో సభ్యులు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ.. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కట్టబెడుతున్న రాయితీల జాబితాను యథావిధిగా తమ రాష్ట్రానికి కూడా వర్తింజేయాల్సిందేనంటూ.. విభజన చట్టంలోని హామీలను సమస్తం నెరవేర్చి తీరాల్సిందేనంటూ... ప్రధాన డిమాండ్లతో.. అందులో ఏమేం పెండింగ్ లో ఉన్నాయో కేంద్రానికి తెలియజెప్పడం అనేది లక్ష్యంగా ఈ నలుగురు సభ్యుల జట్టు ఢిల్లీ కి వెళ్లింది.
అయితే ఈ బృందం సాగించిన చర్చలు చేసిన డిమాండ్లను చూస్తోంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. వీరు అసలు హోదా డిమాండ్ చేయడానికే ఈ మీటింగుకు వెళ్లారా? లేదా, చంద్రబాబు తరఫున కేంద్రంతో బేరం మాట్లాడ్డానికి వెళ్లారా అనే అనుమానం కలుగుతోంది. ప్రత్యేకహోదా అన్న తరువాత.. అదొక్కటే మాటకు వారు కట్టుబడి డిమాండ్ చేయాలి. అందుకు కేంద్రాన్ని ఒప్పించాలి. అది తమ హక్కు అని, ఇవ్వకపోతే కేంద్రానికే ఇబ్బందులు తప్పవని వారికి తెలియజెప్పాలి.
అయితే వెళ్లిన ప్రతినిధులు వ్యవహరించిన తీరు అలా లేదు. ప్రత్యేక హోదా కింద పన్ను రాయితీలు ఇవ్వాలి- మీరు కొంత వరకు ఇస్తే చాలు.. మిగిలింది మేం రాష్ట్రప్రభుత్వం తరఫున ఇస్తాం.. మీరు కొంతవరకు రాయితీల కింద ఏడాదికి రెండు వేల కోట్లివ్వండి చాలు అంటూ వారు బేరాలాడడం చూస్తోంటే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదేదో అచ్చంగా బేరసారాలకు వచ్చిన వ్యవహారం లాగానే ఉన్నదని పలువురు అనుకుంటున్నారు. తీరా అరుణ్ జైట్లీతో జరిగిన సమావేశంలో ఏదీ ఒక కొలిక్కి రానేలేదు.. వాయిదా పడింది.
అయితే.. చంద్రబాబు మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టే సమస్యలేదు అంటూ తమ జట్టుకు పురమాయించినట్లుగా తెలుస్తున్నది. ఇంతకూ వారేం అనుకున్నారు. అచ్చంగా ప్రత్యేకహోదానే అనుకున్నారా? లేదా, అందులో ఏదైనా కథా కమామీషూ ఉన్నదా..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. కేంద్రం నుంచి ఏది సాధించినా సరే.. చాలా సాధించేశాం.. ఇంతకు మించి సాధించడం ఇంకేమీ ఉండదు.. సాధించడంలో మమ్మల్ని మించిన వాళ్లు లేరు.. అంటూ డబ్బా కొట్టుకుంటూ.. ప్రజల్ని మళ్లీ మాయ చేయడానికి పచ్చ దళాలు సిద్ధంగా ఉన్నాయేమో అనుమానం కలుగుతోంది.