మ‌హానాడు : విన్నారా అల‌నాటి వేణు గానం

Update: 2022-05-27 08:30 GMT
గండిపేట‌లో ఆ రోజు రామ దండు ఉండేది. కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ ఇప్పించే వారు ఎన్టీఆర్. అదంతా ఆర్ఎస్ఎస్ త‌ర‌హా శిక్ష‌ణ. అటుపై పార్టీలో క్రియాశీల‌క స‌భ్య‌త్వాలు పెర‌గ‌డం, చాలా మంది బీసీ నాయ‌కుల‌కు అవ‌కాశాలు రావ‌డం అన్న‌వి  చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్ప‌టికీ తెలంగాణ వాకిట కానీ ఆంధ్రా వాకిట కానీ ఎదిగిన ప్రాంతీయ పార్టీల‌లో ఎక్కువ‌గా క‌నిపించేది తెలుగుదేశం పార్టీ నాయ‌కులే !

ఇక ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కూ ఎవ‌రి ప‌రిధిలో వారు పార్టీని నిలుపుకునేందుకు కృషి చేసిన‌వారే ! ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీలో కొన్ని మార్పులు రానున్నాయి. లోకేశ్ ను తెరపైకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి! ఎన్టీఆర్ వార‌సులు ఏమ‌య్యారు అన్న వాద‌న కూడా సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది.

అయితే ఎన్టీఆర్ వార‌సుల‌కు ఇటుగా వ‌చ్చే ఇంట్ర‌స్ట్ లేదు. బాల‌య్య కూడా హిందూపురం వ‌ర‌కూ తనని తాను ప‌రిమితం చేసుకున్నారు. అలాంట‌ప్పుడు నంద‌మూరి వార‌సుల ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చినా, రాకున్నా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేదు. రాజ‌కీయ ప‌రంగా పురంధ‌రి బాగానే రాణించారు.

ఆ మాట‌కు వ‌స్తే అన్న గారి అమ్మాయిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో కాకుండా కాంగ్రెస్ , బీజేపీ లాంటి జాతీయ పార్టీల‌లో త‌న‌దైన వాగ్ధార‌తో రాణించారు. రాణిస్తున్నారు కూడా ! ఆ మాట‌కు వ‌స్తే అన్న ఎన్టీఆర్ పేరును నిల‌బెట్టింది ఓ విధంగా పురంధ‌రే ! అన‌డంలో సందేహం లేదు.

ఇక పార్టీని ఆరంభించిన తొమ్మిది నెల‌ల‌కే అధికారం కైవ‌సం చేసుకున్న గొప్ప చ‌రిత్ర ఎన్టీఆర్-ది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక‌తను అందుకుని పాల‌న‌ను ప‌రుగులు పె ట్టించిన చ‌రిత్ర చంద్ర‌బాబుది. ఆ ఇద్ద‌రి స్థాయిలో లోకేశ్ రాణించాలంటే ఇప్ప‌టి క‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డాలి. కొత్త ముఖాల‌ను ప్రోత్సహించాలి.

కేవ‌లం వార‌స‌త్వ రాజ‌కీయాల‌నే కాదు మిగ‌తా వారిని కూడా ప‌రిగ‌ణించి, ఎదిగి వ‌చ్చేందుకు వారికి త‌గిన‌న్ని అవ‌కాశాలు ఇవ్వాలి. ఇవేవీ చేయ‌కుండా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయ‌న ఉన్నా ఒక్క‌టే లేకున్నా ఒక్క‌టే అన్న అభిప్రాయం స‌గ‌టు టీడీపీ అభిమాని నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News