ఎన్టీఆర్ అనే పేరు వింటే ఆయన పులకించిపోతారు.. వయసు 83 ఏళ్లు దాటినా ఎన్టీవోడిపై ప్రేమ పెరిగిందే తప్ప, తగ్గలేదంటారు.. అందుకే అన్నగారు దూరమైనా.. ఆయన పెట్టిన పార్టీకి నేనుసైతం అంటూ సేవ చేస్తున్నారు. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మమకారంతో.. తెలుగుదేశం పార్టీ గుర్తుతో ప్రతిమలు తయారు చేస్తూ మహానాడు ప్రతినిధులకు అందించేందుకు సిద్ధమయ్యారు.
మహానాడు కోసం తెలుగుదేశం పార్టీ ప్రతిమలు తయారుచేస్తున్నారు.. ఓ వీరాభిమాని. ప్రకాశం జిల్లా కంభానికి చెందిన సయ్యద్ హుస్సెన్ పీరా.. పార్టీ పెట్టినప్పటి నుంచీ అందులోనే కొనసాగుతూ తన వంతు సేవలు అందిస్తూ వస్తున్నారు. సినీ తారకరాముడిపై ఎనలేని అభిమానం పెంచుకున్న పీరా.. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత.. ఆ పార్టీకి వీరాభిమానిగా ఉంటున్నారు. పార్టీపై అభిమానంతో.. టీడీపీ జెండా గుర్తుతో ప్రతిమలను తయారుచేస్తున్నారు.
ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు వచ్చిన ప్రతినిధులకు ఈ ప్రతిమలను అందించేందు కు.. 150 ప్రతిమలను సిద్ధం చేశారు. ఇప్పటివరకు దాదాపుగా 750 ప్రతిమలు తయారు చేసినట్లు తెలిపిన పీరా.. తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీతోనే ఉంటానని అంటున్నారు.
ప్రతి మహానాడుకు ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తన ఇంటిని కూడా టీడీపీ గుర్తు మాదిరిగానే నిర్మించుకోవడంగమనార్హం. అదే సమయంలో మహానాడుకు ఆయన తనవంతు విరాళంగా రూ.500 అందజేశారు.
నిజానికి పార్టీకి ఇంత సేవ చేస్తున్నా.. ఎప్పుడు.. పదవులు.. కొసం.. పీరా ఆలోచించలేదు. తను ఎంత వరకు అయితే.. కృషి చేయగలనో.. అంత వరకు పపార్టీకి సేవ చేస్తానని చెబుతున్నారు. పీరా ఇంట్లో ని వారంతా కూడా టీడీపీకి అభిమానులే కావడం గమనార్హం.
ప్రతి సంవత్సరం.. మహానాడుకు వచ్చి.. పాల్గొని.. ఆసాంతం మూడు రోజుల పాటు.. ఇక్కడే ఉండి.. సభలను తలకించడం.. పీరా అభిమానాన్ని చాటుతుంది. వయోవృద్ధుడు అయినా.. యువకుడిలా ఆయన అందరలోనూ కలిసిపోతారు. ఇది మరో చిత్రమైన సంఘటన.