వైసీపీ నామినేటెడ్ ప‌ద‌వుల‌పైనా టీడీపీకి ఏడుపేనా......!

Update: 2022-11-09 04:34 GMT
రాష్ట్రంలో ఏ ప్ర‌భుత్వం కొలువు దీరినా.. నామినేటెడ్ ప‌దువులు సృష్టించ‌డం.. వాటిని త‌మ వారికి ఇవ్వ డం ఆన‌వాయితీగా మారింది. ఈ విష‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోని ప్ర‌భుత్వాల‌కు.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వా ల‌కు కూడా తేడా ఏమీ లేదు. వైఎస్ హ‌యాం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఎన్నిక‌ల‌కు ముందు త‌ర్వాత త‌మ‌కు ప్ర‌యోజ‌నం అనుకున్న వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డం స‌హ‌జంగా మారిపోయింది. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత కూడా టీడీపీ ఇదే ప‌నిచేసింది. అప్ప‌ట్లో అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చింది.

అయితే.. ఇప్పుడు మాత్రం టీడీపీ నేత‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం త‌మ వారికి ప‌ద‌వులు ఇస్తోంద‌ని.. ఈ క్ర‌మంలో ప్ర‌జాధ‌నాన్ని వారికి జీతాలు గా చెల్లిస్తోంద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అంతేకాదు.. జ‌గ‌న్ సొంత మీడియాకు చెందిన వారికి కూడా నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తూ.. వారికి కూడా ప్ర‌జాధ‌నాన్ని దోచిపెడుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.అ యితే.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలోనూ కుటుంబరావు, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ వంటివారికి నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చారు.

అంతేకాదు.. దీనికి ముందు వైఎస్ హ‌యాంలోనూ తులసిరెడ్డి వంటివారికి కూడా నామినేటెడ్ ప‌ద‌వులు సృష్టించి ఇచ్చారు. మ‌రి ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. అంటే గ‌తంలోనూ ఇలాంటి వ్య‌వ‌హారాలు సాగిన ద‌రిమి లా.. ఇప్పుడు మాత్ర‌మే వైసీపీ చేస్తోంద‌ని చెప్ప‌డానికి టీడీపీ సాహ‌సించ‌డం.. నిజంగా రాజ‌కీయ‌మేనని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిజానికి నామినేటెడ్ ప‌ద‌వుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంత ఉప‌యోగం ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు కాద‌నే వారు ఉన్నా.. గ‌తంలో చంద్ర‌బాబుకానీ, వైఎస్ కానీ, ఇదే ప‌నిచేసిన నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ చేస్తున్న‌ది త‌ప్ప‌ని చెబుతున్నా.. వారి త‌ప్పులే ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి.

దీంతో వైసీపీ చేస్తున్న‌ది త‌ప్పెలా అవుతుంద‌నే ఎదురు దాడి క‌నిపిస్తోంది.మొత్తంగా చూస్తే.. వైసీపీ గ‌తంలో కంటే కొంచెం ఎక్కువ‌గాఈ విష‌యంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌నే విష‌యం వాస్త‌వ‌మే. ఏకంగా 46 మంది స‌ల‌హాదారుల‌ను నియ‌మించ‌డం.. కోర్టులు త‌ప్పుబ‌డుతున్నా.. కొత్త‌వారికి పగ్గాలు అప్ప‌గించ‌డం మాత్రం వివాదానికి దారితీస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News