రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్‌ను, కేసీఆర్ ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా విఫలమవుతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై ఎదురు దాడిని కూడా వ్యూహాత్మకంగా చేయలేకపోతోందని చెబుతున్నారు. మహా సంకల్ప సభ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా టీఆర్‌ఎస్‌ను కానీ కేసీఆర్‌ను కానీ ఇరుకున పెట్టేలా లేవని, పైగా కేసీఆర్‌కే మరిన్ని అస్త్రాలు ఇచ్చేలా ఉన్నాయని వివరిస్తున్నారు.
అదను చూసి వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిన కేసీఆర్ చంద్రబాబుపై పైచేయి సాధించారు. తొలుత రేవంత్ స్టింగ్ ఆపరేషన్‌తో టీడీపీని గుక్కతిప్పుకోకుండా చేసిన ఆయన.. ఆ తర్వాత చంద్రబాబు ఆడియో టేపులు బయటపెట్టి పరువు తీసేశారు. దీంతో టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతలంతా కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసేశారు. వీటివల్ల ఉపయోగం ఏమిటో టీడీపీ వ్యూహకర్తలకే తెలియాలి. నిరసన వ్యక్తం చేశామని చెప్పినా.. తెలంగాణలో ఆ నిరసన మచ్చుకు కూడా లేదు. ఇక, చంద్రబాబు మాట్లాడుతూ మాకూ హైదరాబాద్‌లో హక్కు ఉంది. మాకూ అక్కడ ఏసీబీ ఉంది. మాకూ పోలీసులు ఉన్నారని చిన్న పిల్లాడు మాట్లాడినట్లు మాట్లాడారని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
ఈ అంశంలో కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలంటే ఒక్కటే మార్గమని, అది హైదరాబాద్‌లోని శాంతి భద్రతలపై అధికారాన్ని గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమని, ఆ దిశలో ఎటువంటి ప్రయత్నాలూ చేయకుండా ఏపీలో కేసులు పెట్టి ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో టీడీపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేను టీడీపీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. కానీ, సోమవారంనాటి ప్ర
సంగంలో ఆయన దానిపైనే ఎక్కువగా దృష్టిసారించి ఉంటే కేసీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఉండేది కాదని వివరిస్తున్నారు. తాను తప్పు చేయనని కేసీఆర్ ప్రకటించారని, కానీ అవన్నీ తప్పుడు పనులేనని చంద్రబాబు నిరూపించడానికి బదులుగా ఆయనకే అస్త్రాలు ఇచ్చేలా మాట్లాడారని వివరిస్తున్నారు. మొత్తంమీద ఈ అంశంలో టీడీపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని, వ్యూహాలు వదిలేసి యుద్ధం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.