దశాబ్దాలకు తరబడి సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే.. దాన్ని బలపర్చిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీగా చెప్పాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ సానుకూల ప్రకటనకు కారణమైన తెలుగుదేశం పార్టీ కథ తెలంగాణలో ముగిసిపోయింది. తెలంగాణ ఏర్పాటు అంశంపై అందరూ మాటలు మాత్రమే చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా కొత్త రాష్ట్ర ఏర్పాటుకు తాము సానుకూలంగా ఉన్నట్లుగా తొలి లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేనన్న మాటను అస్సలు మర్చిపోకూడదు.
అలాంటి ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయి. తెలంగాణలో మిగిలిన అరకొర నేతలంతా టీఆర్ ఎస్ లో చేరిపోవటం ఒక ఎత్తు అయితే.. ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్న టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందన్న వ్యాఖ్య చేయటం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పార్టీ డబ్బా క్లోజ్ అయిన మరో పార్టీగా చెప్పాలి. టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్ తో పాటు.. పలువురు నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు.
అరకొరగా ఉన్న నేతలంతా టీఆర్ ఎస్ లో చేరటానికి సిద్ధమైపోతున్న నేపథ్యంలో.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయ్యిందనే చెప్పాలి. తాజాగా పలువురు టీడీపీ నేతల మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. హైదరాబాద్ మహా నగరంలోని మిగిలిన నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. వారందరికి పార్టీ సముచిత స్థానం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రోజు వచ్చినప్పుడు ఆ మాత్రం హామీ ఇవ్వకుండా ఉంటారా?