స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అంతా ఖాళీ అవుతుండగా.. ఉన్న వారి మధ్య ఐక్యత లేదు. పైగా పార్టీ తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతూ ఒకరినొకరు భావిస్తూ విమర్శలు చేసుకుంటుండడంతో టీడీపీ లో ఉన్న విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. దీంతో ఆ రెండు వర్గాల మధ్య నువ్వెంత.. నువ్వెంత అంటూ కొట్టుకునే దాక వెళ్తున్నాయి. తాజాగా అనంతపురము జిల్లాలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
ప్రస్తుతం అనంతపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తాను సూచించినవారికి కొన్ని కార్పొరేటర్ స్థానాలు కేటాయించాలని టీడీపీ అనంతపురము లోక్ సభ నియోజకవర్గ ఇన్‌చార్జి జేసీ పవన్ పట్టుబడుతుండగా.. అయితే పార్టీ అనంతపురం పట్టణ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాత్రం తన వర్గానికి పెద్ద పీట ఇచ్చేలా వ్యూహం రచిస్తుండడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. దీంతో అవసరమైతే దేనికైనా తెగించే దాక పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారని అనంతపురములో చర్చ సాగుతోంది.
జిల్లాలో తనకే బలం ఉందని, లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే తనకే అధికంగా ఓట్లు వచ్చాయని దీంతో తన అనుచరులకు అధిక సీట్లు ఇవ్వాలని జేసీ పవన్ రెడ్డి కోరుతున్నాడు. పార్టీలో పనిచేస్తున్న తన వర్గీయులకు కనీసం 12 కార్పొరేటర్ స్థానాలు ఇవ్వాలని జేసీ పవన్ కోరుతున్నాడు. అయితే లేదు.. మాకే కావాలని ప్రభాకర్ చౌదరి చెబుతున్నాడు. వీరిద్దరి వైఖరితో పార్టీ నాయకత్వం తల పట్టుకుంది. దీంతో జిల్లా నాయకత్వం చేసేదేమీ లేక పార్టీ అధినేత దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. ఏమైనా చేయండి.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కలిసి పని చేయాలని, ఇద్దరు కలిసి ఓ అభిప్రాయానికి రావాలని సూచించిందంట. పవన్ రెడ్డి వర్గానికి అన్ని సీట్లు ఇస్తే ఎలా.. మిగతా వారికి ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సీపీఐ తో ఉన్న పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి మూడు నాలుగు సీట్లు కేటాయించాలి. ఆ నేపథ్యంలో వారిద్దరికి పోగా తమ వర్గానికి ఏమిస్తామని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించాడు.
అయితే ఈ విబేధాలను పార్టీ తాత్కాలికంగా సమసిపోయేలా చేసిందని తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఈ విధంగా విబేధాలు బహిర్గతం కావడం తో ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ప్రస్ఫుటంగా పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విధంగా రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీని చూసి ఓటర్లు అసహ్యించుకుంటున్నారని, ఎన్నికల్లో నష్టపోయే అవకాశాలున్నాని అనంతపురములో టాక్ వినిపిస్తోంది. మరి అనంతపుము మున్సిపాలిటీ లో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.