వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చితీరాలని భావిస్తున్న టీడీపీ ఇక నుంచి వ్యూహం మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి టీడీపీ నినాదం.. ఇపప్పటి వరకు బీసీ మంత్రం! దీనిని ఆ పార్టీ ఆది నుంచి అనుసరిస్తున్న విధానం.
ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. టీడీపీ వ్యూహా త్మకంగా బీసీ మంత్రాన్ని పఠిస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో ఈ వర్గం వైసీపీ వైపు మళ్లుతున్న పరిస్థి తి కనిపి స్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. ఉప ఎన్నికలనుపరిశీలిస్తే.. టీడీపీ అంచనాకు వచ్చింది.
ఈ క్రమంలో.. బీసీ వర్గాన్ని మళ్లీ చేరువ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువగా సీట్లు ఇవ్వడంతోపాటు.. యువతకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని.. పార్టీ భావిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు తమ వెంటే ఉంటారని అనుకున్న బీసీ వర్గం.. ఇప్పుడు.. వైసీపీ వైపు మళ్లిపోతుండడంతో.. టీడీపీకి మరో మంత్రం పఠించక తప్పడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తు తం వైసీపీ బీసీ మంత్రం పఠిస్తోంది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున బీసీలకు పదవులు కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే.. వచ్చే ఎన్నికల్లో బీసీ మంత్రంతోపాటు.. మధ్యతరగతి వర్గాన్ని కూడా కలుపుకొని పోతే తప్ప.. టీడీపీ అనుకున్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం మధ్యతరగతి వర్గం వైసీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. పేదలు.. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు.. ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కింద.. నిధులు అందుతున్నాయి. కానీ, మధ్యతరగతి వర్గాననికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ వర్గం మాత్రం..తీవ్ర అసంతృప్తితోనూ.. ఆవేదనతోనూ ఉంది. పైగా.. చార్జీల భారం.. పెట్రో ధరల భారం కూడా తమపైనే పడిందని.. మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. పైగా ప్రభుత్వం అప్పులు చేసి చేస్తున్న సంక్షేమాన్ని.. అదేవిధంగా మూడు రాజధానుల అంశాన్ని కూడా వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. మధ్యతరగతి వర్గాన్ని ఆకర్షించేలా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనినిర్ణయించుకున్నట్టు.. పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఇది ఏమేరకు ఆయనకు సక్సెస్ తెచ్చి పెడుతుందో చూడాలి.