టీడీపీ అధినేత చంద్రబాబు.. పోలీసులను పావుగా చేసుకొని ఆడుతున్న ఆట ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ఉదయం శ్రీకాకుళంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా పోలీసులు డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కై పోగా.. తాజాగా బందోబస్తుకు వెళ్లే పోలీసులను టీడీపీకి బ్యాలెట్ ఓటు వేసి వెళ్లాల్సిందిగా పోలీస్ బాస్ లు ఒత్తిడి తీసుకువస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు ఎన్నికల బందోబస్తుకు వెళుతున్నారు. వీని దృష్టిలో పెట్టుకొని వారి ఓట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యేలా పోలీస్ బాసులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ తీసుకొని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి తమకు అందజేయాలని హుకూం జారీ చేశారట.. ఇందుకోసం పలువురు డీఎస్పీలు పనిగట్టుకొని సీఐ నుంచి కానిస్టేబుల్స్ వరకూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి టీడీపీకి ఓటు వేయాలని ఆదేశించినట్టు పోలీసులు అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.
పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితో తాము స్వేచ్ఛగా ఓటు వేయలేకపోతున్నామని.. తమ ఓటు హక్కును కాలరాస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. మా ఓట్లు కూడా వారే వేసుకోవచ్చు కదా అని గుంటూరు జిల్లా సీఐ ప్రశ్నించడం కలకలం రేపుతోంది. ఇక ఉన్నతాధికారులు టీడీపీకి బ్యాలెట్ ఓటు వేయాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన హోంగార్డు వాపోయాడు.
ఇలా అనేక మంది పోలీసులకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. పోలీసుల సంఘాల పేరుతో ఇప్పటికే పలువురు జిల్లాల్లో తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని పోలీసులు వేధిస్తున్నారట.. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.