రాజకీయాల్లో సహనం ఉండాలి. ఎందుకంటే ఎపుడూ గెలుపు మాత్రమే పలకరించదు, ఓటమి కూడా చాలాసార్లు ఎదురవుతుంది. పైగా తమ చేతిలో పవర్ లేకపోతే ప్రత్యర్ధులకు టార్గెట్ అవుతారు. ఆ సమయంలో గట్టిగా అన్ని శక్తులను కూడదీసుకుని తెలివిగా పోరాడాలి. జనంలో మళ్లీ మంచితనాన్ని, మర్యాదను సంపాదించుకుని అధికారం చేపట్టాలి. టీడీపీ తీరు చూస్తే గత రెండున్నరేళ్లుగా చాలా అసహనంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తమ చేతిలోనే ఎప్పటికీ అధికారం ఉంటుందని భ్రమించిన ఆ పార్టీకి అయిదేళ్ళు గిర్రున తిరగకుండానే కుర్చీ జారిపోవడం షాక్ గానే ఉంది. అయితే ఇప్పటికి సగం పాలన వైసీపీ పూర్తి చేసుకుంది. అయినా వాస్తవంలోకి టీడీపీ వచ్చినట్లుగా కనిపించడంలేదు.
అధినాయకుడు నుంచి దిగువ స్థాయి కార్యకర్త దాకా ముఖ్యమంత్రిగా జగన్ని అసలు గుర్తించడానికే నిరాకరించే పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పుకుని ఎన్నికలలో పోటీ చేసిన వారు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పునే తప్పు పట్టడం దారుణమే. చంద్రబాబే ఇప్పటికి అనేక సందర్భాల్లో ప్రజలు తప్పు చేశారు, అనవసరంగా వైసీపీని గెలిపించారు. దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు అంటూ నిష్టూరంగా మాట్లాడారు, ఇక సీనియర్ నేతలుగా ఉన్న అయ్యన్నపాత్రుడు వంటి వారు కూడా ఇలాగే జనానిదే తప్పు అంటున్నారు. అంటే తమను గెలిపించకపోతే జనమే పొరపాటు చేశారని మాట్లాడడం ఏ రకమైన ప్రజాస్వామ్యమో టీడీపీ నేతలే చెప్పాలి.
ఇక వరసగా ఈ రోజు వరకూ జరిగిన అనేక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అవుతూ వచ్చింది. ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ కూడా వారిలో చాలానే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే చేయాల్సింది చాలానే ఉంది. ఒంటరి పోటీ అంటే టీడీపీకి ఇబ్బందే. ఇతర పక్షాలు అయితే ఈ రోజు దాకా జట్టు కట్టేందుకు ముందుకు రావడంలేదు. అదే సమయంలో పార్టీలో ఉన్న కీలకమైన నేతలు కూడా రోడ్ల మీదకు రావడంలేదు. ఇలా చాలా అంశాల్లో టీడీపీ చాలా ఒత్తిడికి లోను అవుతోంది.
దాంతో టీడీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నేతలను నమ్ముకుంటోంది. వారికి గట్టి భరోసా ఇస్తోంది. దాంతో ఇప్పటిదాకా కనీసం కార్పోరేటర్ కూడా నెగ్గని నాయకులు మీడియా సమావేశాలు పెడుతున్నారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎంత ఎక్కువగా మాట్లాడితే అది ఎంత బాగా వైరల్ అయితే తమకు మార్కులు అంత బాగా పడతాయన్న ఉత్సాహంలో వారు హద్దులు దాటేస్తున్నారు. దాని ఫలితమే ఇపుడు పట్టాభి లాంటి నాయకులు ముఖ్యమంత్రి జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం. అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు వేరేలా రియాక్ట్ కావచ్చు. కానీ వారు కూడా ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. ఫలితమే ఏపీ రాజకీయాలో బరస్ట్ పాలిటిక్స్ నడుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇది ఆరంభమా అంటే అవును అనే జవాబు రావడం మాత్రం ప్రజాస్వామ్య ప్రియులకు తీరని విషాదమే.