బ్రేకింగ్ .. ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ సీనియర్ నేత ...

Update: 2020-03-04 06:29 GMT
బంగి అనంతయ్య...రాజకీయాలలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు. గతంలో కర్నూలు మేయర్ గా కర్నూల్ వాసులకి సేవలందించిన ఆయన, వివిధ వేషధారణలతో ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలను ఆయన ఆకట్టుకున్నారు. టీడీపీ లో కొనసాగుతున్న ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే , తాజాగా అయన తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో అయన ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నట్టు తెలుస్తుంది.

అయితే , ఈ విషయాన్ని సకాలంలో గమనించిన స్థానికులు ఆయనను రక్షించారు. అనంతరం హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బంగి అనంతయ్య ఆత్మా హత్యాయత్నం చేశారనే వార్తతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. అయితే పార్టీలో పదవులు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. రాజకీయం గా అందరూ మోసం తనను మోసం చేశారని కొంతకాలంగా ఆవేదన తో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మరోవైపు ఆర్థిక సమస్యల కారణం వలనే బంగీ ఆత్మహత్యా యత్నం చేసుకున్నారని బంగీ కుమారుడు చెబుతున్నారు.
Tags:    

Similar News