ఓవర్ నైట్ చేంజ్ : పొత్తుల మీద టీడీపీ షాకింగ్ డెసిషన్....?

Update: 2022-05-19 07:47 GMT
తెలుగుదేశం పార్టీ ఈ నాటిది కాదు, నాలుగు దశాబ్దాల రాజకీయం ఆ పార్టీది. ఎన్నో ఎన్నికలను చూసిన అనుభవం టీడీపీ సొంతం. ఇక రాజకీయ చాణక్యుడు చంద్రబాబు టీడీపీకి అతి పెద్ద ఆస్తి. ఇదిలా ఉంటే టీడీపీ ఆత్మగౌరవం దెబ్బ తీయడానికి వైసీపీ ఈ మధ్య దాకా చాలానే మాట్లాడింది. చంద్రబాబు పొత్తులతో తప్ప సొంతంగా పోటీ చేయలేరు అని కూడా విమర్శలు చేస్తూ వచ్చింది.

ఒక విధంగా బాబుని రాజకీయంగా పలుచన చేస్తూ అనేక రకాలైన  కామెంట్స్ చేసింది. ఇక టీడీపీ విషయం తీసుకుంటే జనసేనతో పొత్తులు పెట్టుకోవాలని చూసింది. ఆ విధంగా బీజేపీతో చేతులు కలిపి 2014 కూటమిని పునరుద్ధరించాలని కూడా ఆలోచించింది. అయితే ఇపుడు అనేక కారణాల రిత్యా టీడీపీ నిర్ణయం లో కీలకమైన మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముందుగా చెప్పుకుంటే చంద్రబాబు జిల్లా టూర్లు. ఈ మధ్య చంద్రబాబు చేపడుతున్న జిల్లా టూర్లకు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. బాబు ఎక్కడికి వెళ్లినా జనాలు జేజేలు పలుకుతున్నారు. ఒక విధంగా జనం పల్స్ ఏంటి అన్నది తెలుగుదేశం అధినాయకత్వం అంచనా కట్టింది అంటున్నారు.  జగన్ అడ్దా అనుకున్న  రాయలసీమ జిల్లాలలో కూడా టీడీపీకి ఒక రేంజిలో జనాదరణ లభిస్తూండడంతో ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు.

ఇంకో వైపు దాదాపుగా 175 నియోజకవర్గాల నుంచి నాయకులు క్యాడర్ బాబుని నిత్యం కలుస్తూ వస్తున్నారు. వారంతా కోరేది ఒక్కటే. సొంతంగా పోటీ చేద్దామని. ఆ విధంగా చేసి సత్తా నిరూపించుకుందామని. దానికి వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సొంతంగా పోటీ చేసే తమకు పోటీకి అవకాశాలు పెరుగుతాయని. అంతే కాదు జిల్లా టూర్లకు టీడీపీకి వస్తున్న స్పందనతో చాలా మంది నాయుకులు ఈ సారి టీడీపీ తరఫున బరిలో నిలవాలని అనుకుంటున్నారు.

మరి పొత్తుల పేరిట ఒక యాభై దాకా సీట్లు త్యాగం చేస్తే అది మొదటికే మోసం గా మారుతుంది అంటున్నారు. ఇది టీడీపీలో ఉన్న విషయం అయితే జనసేన వైపు నుంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు. జనసేన ఏకంగా డెబ్బయి అయిదు దాకా సీట్లను డిమాండ్ చేస్తోందని ప్రచారం అయితే సాగుతోంది.

ఇంకా చెప్పాలంటే పవర్ షేరింగ్ కి కూడా ఆ పార్టీ బేరాలు ఆడనుందని అంటున్నారు. పవన్ ఈసారి సీఎం. దానికి టీడీపీ అంగీకరించాలని కూడా జనసేన నాయకులు అంటున్నారు. వీటిని బట్టి చూస్తే ఈ పొత్తులు అంత సులువుగా తేలే అవకాశాలు అయితే లేవు. దాంతో ఈ పొత్తుల వల్ల కొత్త సమస్యలు వస్తాయని కూడా అంటున్నారు.

ఇక ఎక్కువ సీట్లు జనసేన డిమాండ్ చేసినా ఆ పార్టీకి అంతమంది అభ్యర్ధులు ఉన్నారా అన్న చర్చ కూడా టీడీపీలో సాగుతోందిట. ఇక పొత్తుల వల్ల సీట్లు ఎక్కువగా ఇచ్చినా సరైన క్యాండిడేట్లు లేకపోతే అది వైసీపీకే లాభమని కూడా ఆలోచిస్తున్నారుట. ఇక పవన్ కళ్యాణ్ వైపు ఉంటే కాపులు ఎంతవరకూ దగ్గర అవుతారో తెలియదు కానీ బీసీలు దూరం అవుతారన్న బెంగ కూడా టీడీపీలో కొత్త ఆలోచనలు కలిగించేలా చేస్తోంది అంటున్నారు.

మొత్తానికి చూస్తే బాబు జిల్లా టూర్ల తరువాత టీడీపీలో ధీమా బాగా పెరిగిందిట. విపక్షంలో ఉన్నపుడు సింగిల్ గా పోటీ చేయడమే బెటర్ అన్న పొలిటికల్ సూత్రాన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తూ టీడీపీ సొంతంగా బరిలోకి దిగనుంది అంటున్నారు. ఇక ఏపీలో వైసీపీకి ఈ రోజుకీ ఆల్టర్నేషన్ టీడీపీయే అని, మిగిలిన పార్టీలు ఎన్ని పోటీలో ఉన్నా జనాలు టీడీపీనే గెలిపిస్తారు కాబట్టి ఓట్లు చీలే సమస్య లేదని కూడా ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట. మొత్తానికి టీడీపీ కూడా సింగిల్ గానే వస్తుంది అన్న సంకేతాలు అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News