గడప గడపకో కధ, వెళ్ళిన చోటల్లా సెగ బాగా తగులుతోంది. అంతా బాగుంది అనుకుంటూ వెళ్తున్న వైసీపీ ప్రజా ప్రతినిధులకు జనాలు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కో చోట ఆ వేడిని తట్టుకోలేక ఎమ్మెల్యేలు వెనక్కిపోతున్నారు. జగన్ వర్క్ షాప్ లో మనం అన్నీ చేశాం కదా కాలరెగరేసి మరీ గొప్పగా పాలన మీద చెప్పుకోండి అని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు.
ఎక్కడ ఎమ్మెల్యే వస్తే అడుగుదామని కాచుకుని కూర్చున్న జనాలకు ఈ గడప గడపకు ప్రొగ్రాం బాగా కలసివస్తోంది. దాంతో అమ్మా పెన్షన్ అందిందా పధకాలు బాగున్నాయా అంటూ పలకరించి వెళ్తున్న ఎమ్మెల్యేలను నిగ్గదీస్తున్నారు జనాలు
ముందు రోడ్డు చూడండి అని గుంటలు పడిన రహదారులను చూపిస్తున్నారు. అంతే కాదు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చేదు అనుభవమే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఎదురైంది. ఆయనకు జన ప్రతాపం ఏంటో తెలిసివచ్చింది అని అంటున్నారు.
తన నియోజకవర్గంలోని బట్లదిన్నెలో ప్రయటించిన ఎమ్మెల్యేను జనాలు నిలదీశారు. రోడ్లు మూడేళ్ళు అయింది వేశారా అంటూ గట్టిగానే తగులుకున్నారు. దీంతో షాక్ తిన్న ఎమ్మెల్యే టీడీపీ వాళ్లు ఎవరో చెబితే ఆ మాటలు పట్టుకుని నన్ను అడుగుతారా అని మండిపడ్డారు. అయితే ఎదురుగా బట్టతలంత మాదిరిగా గుంతలు కనిపిస్తూంటే ఎవరో చెప్పారని అనడమేంటి అని జనాలు గుస్సా అయ్యారు.
దాంతో ఎమ్మెల్యే నా మీద నమ్మకం ఉంటే నా మాట వింటే రోడ్లు తప్పకుండా వేయిస్తాను అని చెప్పుకున్నారు. దానికి సంబంధించి నిధులు కూడా మంజూరు అయ్యారని తెలిపారు. ఇక రోడ్డు మీ ఊరికి వేయకపోతే కనుక నేను మళ్ళీ వచ్చి ఓట్లు కూడా అడగను అని కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి శపధం చేయడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొన్ని దూషణలు కూడా చేసినట్లుగా సోషల్ మీడియాలో టీడీపీ వారి వదిలిన ఒక వీడియో వైరల్ అవుతోంది. పగిలిపోతుంది. నోరు మూసుకుని వినండి అంటూ ఎమ్మెల్యే అన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఈ వీడియను సోషల్ మీడియాలో పెట్టిన తెలుగుదేశం పార్టీ వారు ఇదండీ మూడేళ్ల జగన్ సర్కార్ అభివృద్ధి, ఈ రోజుకు కూడా మేము ఫలనా పని చేశామని చెప్పి జనాలలోకి వెళ్ళలేని దుస్థితి అంటూ చెడుగుడు ఆడుతున్నారు.

మూడేళ్ళ పాలన తర్వాత కూడా 'నీకు ఇది చేసాం' అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ నేతలది. జగన్ రెడ్డి పాలనతో గడప గడపకి నిరసన సెగలు, నిలదీతలు ఎదురవుతుంటే సమాధానం చెప్పలేక అసహనానికి గురవుతున్నారు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చూడండి pic.twitter.com/uez63uFMzW
— Telugu Desam Party (@JaiTDP) August 8, 2022