పార్లమెంట్ లో టీడీపీ వ్యూహం ఇదే ...బాబు దిశానిర్దేశం !

Update: 2020-01-29 09:31 GMT
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడిన చంద్రబాబు ఏపీ ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా తమ వాదన వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక అంతే కాదు ఏపీలో వైసీపీ హయాంలో జరుగుతున్న అవకతవకలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇకపోతే , పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 9 అంశాలపై చర్చించిన టీడీపీ ఎంపీలు ప్రధానం గా రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల ప్రకటన, ఉపాధి హామీ నిధుల దారిమళ్లింపు, నిలిచిన పోలవరం పనులు - కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న ప్రలోభాలు - రాస్తున్న లేఖలు, మీడియాపై దాడులు - ఆంక్షలు - దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ - టీడీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఇతర నాయకులు - కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపులపై పార్లమెంట్ లో గళమెత్తాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత - విధ్వంస కార్యక్రమాలు - అవినీతి - అక్రమాలు, -కేంద్ర నిధుల సద్వినియోగంలో వైఫల్యం - ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడం, -పెట్టుబడులన్నీ వెనక్కి తరలిపోవడం తదితర అంశాలన్నీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని ఎంపీలకు ఆదేశాలకు జారీచేశారు. 42 రోజులుగా రాజధాని అమరావతి లో భూములిచ్చిన రైతులు - మహిళలు - రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలను పార్లమెంటు లో ప్రస్తావించాలని నిర్ణయించారు.
Tags:    

Similar News