పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల తీరు ఆశ్చర్యంగా ఉంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విస్తరణ వల్ల తెలంగాణాకు ఇబ్బందులు ఎదురవతాయని తెలంగాణా మంత్రలు, టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎత్తిపోతల విస్తరణతో మొదలైన వివాదం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరిగిపోవటానికి కారణమవుతోంది.
ఇదే నేపధ్యంలో టీడీపీకి చెందిన ప్రకాశం జిల్లాలోని ముగ్గురు ఎంఎల్ఏలు జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ తెలంగాణా వాదనకు మద్దతిస్తున్నట్లుగానే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాకు నష్టం జరుగుతుందని లేఖలో స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకం ఎత్తు పెంచటాన్ని ఎంఎల్ఏలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరు సాంబశివరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయటం గమనార్హం.
తమ జిల్లాలోని పంట భూములన్నీ సాగర్ జలాలపైనే ఆధారపడ్డాయని, సాధారణ వర్షపాతంపైనే ఆధారపడినట్లు గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండానే వేరే ప్రాజెక్టులు కడితే జిల్లాలో ప్రజల పరిస్ధితి ఏమిటని జగన్ను ప్రశ్నించారు. పనిలోపనిగా జిల్లాలో వర్షపాతం, పంటల తీరు, బీడుభూముల వివరాలను కూడా ప్రస్తావించారు. అంతా బాగానే ఉందికానీ శ్రీశైలంలో కనీస నీటిమట్టం కూడా లేకుండానే జలవిద్యుత్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి వీళ్ళెవరు ఒక్క లేఖ కూడా రాయలేదు.
ఏపీకి నీళ్ళందకుండా తమ కేటాయింపులకు మించి నీటిని వాడుకునే ఉద్దేశ్యంతో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల గురించి తెలంగాణా సీఎం కేసీయార్ ను నిలదీస్తు టీడీపీ ఒక్క లేఖ కూడా రాయలేదు. కేసీయార్ వైఖరిని తప్పుపడుతు చంద్రబాబునాయుడు కానీ టీడీపీ నేతలు కానీ కనీసం ఒక్కసారి కూడా మీడియా సమావేశం పెట్టలేదు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటి కేటాయింపులను అంగీకరించేది లేదని ప్రకటించిన కేసీయార్ పై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
ఇవన్నీ చేయకపోగా జగన్ను తప్పుపడుతు, తెలంగాణాకు మద్దతుగా టీడీపీ ఎంఎల్ఏలు లేఖ రాయటం విచిత్రంగా ఉంది. తెలంగాణాలోని పార్టీలు తమ ప్రభుత్వ వాదనను సమర్ధిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఏపిలోని పార్టీలు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవలేదు. పైగా ఇపుడు టీడీపీ ఎంఎల్ఏలు రాసిన లేఖ తెలంగాణా వాదనకు మద్దతుగా ఉంది. మరిదే పార్టీ వైఖరా ? లేకపోతే ఎంఎల్ఏల వైఖరితో తమకు సంబంధం లేదని చంద్రబాబు ప్రకటిస్తారా ? చూడాల్సిందే.