తనదైన శైలిలో డైనమిజం ప్రదర్శిస్తూ మాస్ ఇమేజ్ తెచ్చుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ తన తాజా టార్గెట్ గా నిర్దేశించుకున్నట్లు చెప్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. అయితే నాని వైసీపీలో చేరిన నేపథ్యంలో అక్కడ టీడీపీ కోట బీటలు వారింది. మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నాని తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టిపెట్టిన టీడీపీ ఈ క్రమంలో పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడను అత్యంత ప్రాధామ్యంగా భావించింది. పైగా ఏపీ సర్కారు విషయంలో నాని పంటికింద రాయిలాగా మారడాన్ని కూడా తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానిని ఓడించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అయినప్పటికీ నానిని దూరం పెట్టేలా టీడీపీ వ్యవహరిస్తోందని అంటున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి వీరవిధేయుడు అయిన బుద్దా వెంకన్నను ప్రొటోకాల్ ఇంచార్జీగా పెట్టి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కొద్దికాలం క్రితం వైసీపీ తరఫున గెలిచిన మున్సిపల్ చైర్మన్‌ను సైతం టీడీపీలోకి లాగడం కూడా "టార్గెట్ నానీ" వ్యూహంలో భాగమేనని చెప్తున్నారు. అంతేకాదు ఇటీవల పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మరీ గుడివాడలో అభివృద్ధి పనులు చేపట్టడం వెనుక కూడా నానిని ఓడించాలనే వ్యూహంలో భాగమేనని సమాచారం. ఇంత శ్రమ పడుతున్న టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/