కొందరు తెలుగుదేశంపార్టీ నేతలకు అలవాటుగా మారిపోయింది. రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. ఎప్పుడో ఒకపుడు కాస్త దూకుడుగా మాట్లాడినా తర్వాత సంయమనం పాటించటం మామూలే. కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడేయటం తర్వాత పోలీసులు కేసులు నమోదు చేస్తే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం కొందరు తమ్ముళ్ళకు మామూలైపోయింది. తాజాగా మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఇదే కోవలోకి చేరారు.
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికో జగన్ పై ఉమ బురదచల్లేశారు. జగన్ అనని మాటలను అన్నట్లుగా ఓ వీడియో తయారుచేయించారు. దాన్ని మీడియా సమావేశంలో చూపించారు. ప్రత్యేకహోదా ఉద్యమం సందర్భంగా అప్పుడెప్పుడో జగన్ అన్న మాటలను ఉపఎన్నికల సందర్భంగానే తిరుపతిని కించపరుస్తు మాట్లాడినట్లుగా ఫేక్ వీడియోను సృష్టించారు. దాన్ని పట్టుకుని రెండురోజులు మీడియాలో ఊదరగొట్టారు. దాంతో కర్నూలు వైసీపీ నేత ఫిర్యాదు చేశారు.
దేవినేనిపై కేసు నమోదు చేసి రెండుసార్లు విచారణకు రమ్మంటే రాలేదు. సీఐడీ పోలీసులు మంగళవారం తనింటికి వస్తున్నారని తెలుసుకుని అందుబాటులో లేకుండా మాయమైపోయారు. ఆరోపణలు చేయటంలో తప్పేలేదు. కానీ అనని మాటలను అన్నట్లుగా మార్ఫింగ్ చేయాల్సిన దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమిటో అర్ధం కాలేదు. ఆమధ్య శ్రీకాకుళంలో కూనరవి కూడా ఇదే పద్దతి.
ఎంపిడీవో, ఎంఆర్వో లాంటి అధికారులను కూన నోటికొచ్చినట్లుగా బూతులు తిట్టేస్తారు. వాళ్ళు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుకట్టి విచారణకు రమ్మంటే రారు. అరెస్టు చేయటానికి వెళితే అజ్ఞాతంలోకి వెళిపోతారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు. ఇప్పటికి చాలాసార్లు ఇలాగే జరిగింది. పెందుర్తిలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడిది కూడా ఇదే వరస. ప్రత్యర్ధులనే కాదు అధికారులను కూడా నోటికొచ్చినట్లు బూతులు తిట్టేస్తారు. కేసులైతే విచారణకు రమ్మంటే రారు, అరెస్టంటే మాయమైపోతారు.