ద‌ర్శిలో చ‌క్రం తిప్పిన టీడీపీ.. ఎగిరిన ప‌సుపు జెండా!

Update: 2021-11-17 08:06 GMT
రాష్ట్రంలో మలివిడ‌త జ‌రిగిన స్థానిక ఎన్నిక్ల‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు.. వెల్ల‌డ‌వుతున్నాయి. ముఖ్యం గా కొత్త‌గా ఏర్ప‌డిన మునిసిపాలిటీల‌కు జ‌రిగిన ఎన్నిక‌లు ఉత్కంఠ‌గా మారిన విష‌యం తెలిసిందే. మొ త్తం 12 మునిసిపాలిటీలు కొత్త‌గా ఏర్పాటైతే.. వాటిలో ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి కూడా ఒక‌టి. ఇక్క‌డ‌.. రెండు రో జుల కింద‌ట జ‌రిగిన ఎన్నికల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి.

దీనిలో టీడీపీ విజ‌యం సాధించింది. మొత్తం 20 వార్డుల‌కు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగితే.. 13 వార్డుల‌ను .. టీడీపీ ద‌క్కించుకుంది. కేవ‌లం 7 వార్డుల‌ను మాత్ర‌మే.. వైసీపీ ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీకి దాదాపు అన్ని చోట్ల ఎదురు గాలి వీచింద‌నే చెప్పాలి. ఆఖ‌రుకు.. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ సైకిల్ ప‌రుగులు ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో టీడీపీ విజ‌యం ద‌క్కించుకో వ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన వారిలో.. మొత్తం 13 మంది విజ‌యం సాధించారు.

జానికి ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో.. అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి మునిసిపాలిటీని టీడీపీ ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. మ‌ళ్లీ.. ఇప్పుడు ద‌ర్శి ద‌క్క‌డం విశేషం.

ఇక‌, ద‌ర్శి విజ‌యం వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగా.. ముగ్గురు కీల‌క నాయ‌కులు.. టీడీపీ నుంచి క‌నిపిస్తున్నారు. వారిలో కొండ‌పి ఎమ్మెల్యే బాలా స్వామి, అద్దంకి ఎమ్మెల్యే.. గొట్టిపాటి ర‌వి, ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావులు క‌నిపిస్తున్నారు.

పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న వారు.. ఇక్క‌డ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని భావించారు. ఆ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. దీంతో పాటు ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకుని వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఇది పార్టీని విజ‌యం దిశ‌గా న‌డిపించింద‌నే వాద‌న ఉంది.

అయితే.. టీడీపీ విజ‌యానికి మ‌రో రీజ‌న్ కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచి.. ఒక్క ద‌ర్శిలోనే ఎందుకు ప‌రాజ‌యం పాలైంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే మ‌ధ్య వివాదం కూడా ఉండ‌డం.

ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌కు, మాజీ ఎమ్మె ల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. దీనిపై ఇప్ప‌టికే రెండు సార్లు పంచాయితీ కూడా జ‌రిగింది. అయినా.. వీరు త‌గువులాడుకుంటూనే ఉన్నారు. ఇది స్థానిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే టీడీపీ విజ‌యానికి బాట‌లు వేసింద‌ని అంటున్నారు.
Tags:    

Similar News