వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అడ్డుకునే క్రమంలో టీడీపీ శ్రేణులు కాసేపటి క్రితం విజయవాడ సమీపంలోనని గన్నవరం కోర్టు వద్ద చేసిన నానా యాగీ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిన రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు కోర్టు సాక్షిగా అదే ఎమ్మెల్యేపై ఏకంగా దాడికి దిగేలా అసభ్యపదజాలంతో కూడిన నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు చేసిన యాగీపై ఏ తరహా చర్యలు తీసుకోవాలన్న అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. వివరాల్లోకెళితే.. మొన్నటి మహిళా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను గన్నవరం ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు బలవంతంగా ఆమెను కారెక్కించి హైదరాబాదు తిప్పిపంపారు.
ఈ సందర్భంగా తనపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ... వారిపై చర్యలు తీసుకోవాలంటూ రోజా గన్నవరం కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం నేటి ఉదయం ఆమె విజయవాడ వచ్చారు. కోర్టుకు వెళ్లేముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రోజా చంద్రబాబు సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. నందిగామ ప్రమాదంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తూర్పారబట్టారు. ఆ తర్వాత ఆమె నేరుగా కోర్టుకు చేరుకున్నారు. రోజా విజయవాడ వచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొట్టేశారు. రోజాకు వ్యతిరేకంగా నినిదాలు చేయాలని పురమాయించారట. దీంతో వారంతా పార్టీ జెండాలు పట్టుకుని మరీ బయలుదేరారు. అయితే అప్పటికే రోజా కోర్టుకు చేరుకున్నారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని టీడీపీ శ్రేణులు... కోర్టు వద్దకూ పరుగు పెట్టాయి.
రోజా కనిపించగానే ఆమెపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు, నినాదాలు చేస్తూ... హెచ్చరికలు జారీ చేస్తూ వారంతా నానా హంగామా చేశారట. దీనిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేయగా...కాస్త ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండి ఉంటే.. వారంతా కోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లడంతో పాటు రోజాపై దాడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైసీపీ నేత గౌతంరెడ్డి... టీడీపీ శ్రేణుల ప్రొవోకింగ్ అటాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అసెంబ్లీలో చేయని నేరానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు సస్సెండ్ చేశారు కదా... ఇప్పుడు కోర్టు సాక్షిగా టీడీపీ శ్రేణులు చేసిన రచ్చపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ఆయన చంద్రబాబు సర్కారుకు సూటి ప్రశ్నలు సంధించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/