కృష్ణాలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ-వైసీపీ అమీతుమీ!

Update: 2022-03-20 12:30 GMT
రాష్ట్ర వ్యాప్తంగా గెలిచి.. అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎంతో ప్ర‌య‌త్నాలు చే స్తోంది. అదేవిధంగా మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకుని.. త‌మ పంతం నెగ్గించుకునేందుకు అధికార పార్టీ వ్యూహా లు సిద్ధం చేసుకుంటోంది. అయితే.. ఏ వ్యూహంఫ‌లించి ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. ఒక రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం గెలుపు గుర్రం ఎక్క‌క పోతే.. రెండు పార్టీల‌కూ.. అసంతృప్తి త‌ప్ప‌దు.! మ‌రి అలాగ ని.. ఈ రెండు పార్టీలూ విజ‌యంద‌క్కించుకునే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా! ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పార్టీ మాత్ర మే విజ‌యం సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది.

అందుకే.. వైసీపీ, టీడీపీలు ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అమీతుమీ పోరాటానికి సిద్ధ‌ప‌డుతున్నాయి. అంత కీల‌క‌మైన ఆ రెండునియోజ‌క‌వ‌ర్గాలు కూడా కృష్ణాజిల్లాలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌టి మంత్రి కొడాలి నానికి కంచుకోట‌గా ఉన్న గుడివాడ అయితే.. రెండోది వ‌ల్ల‌భ‌నేని వంశీకి కంచుకోట‌గా పేర్కొనే గ‌న్న‌వ‌రం.

గుడివాడ‌లో కొడాలి వ‌రుస‌గా నాలుగు సార్ల నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయి తే.. ఈయ‌న వైసీపీ టికెట్‌పై నే గెలిచినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కంట్లో న‌లుసుగా మారిపోయారు.

గ‌తంలో ఒకింత దూకుడు త‌క్కువ‌గానేఉన్నా.. ఇప్పుడు మంత్రి అయ్యాక నాని దూకుడును ఎవ‌రూ ఆప లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈయ‌న‌ను ఓడించి..త‌గిన గుణ‌పాఠం నేర్పించాల‌ని.. చంద్ర‌బాబు భావి స్తున్నారు. అయితే.. వైసీపీకి కృష్ణాలో ఉన్న ఏకైక ఫైర్ బ్రాండ్ మ‌రోమాట‌లో చెప్పాలంటే.. మంత్రి వ‌ర్గం లో ఉన్న ఏకైక దూకుడు నాయ‌కుడు కొడాలి ఒక్క‌రే. సో, ఆయ‌న‌ను నిల‌బెట్టుకుని తీరాల్సిన అవ‌స‌రం వైసీపీకి ఉంది. దీంతో టీడీపీ వేసే వ్యూహాల‌కు ఇటు కొడాలి ప‌రంగా.. అటు స‌ర్కారు ప‌రంగా కూడా ప్ర‌తి వ్యూహాలు వేయ‌డంఖాయమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలుద‌క్కించుకున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇప్ప‌టికీ.. టెక్నిక‌ల్‌గా టీడీపీ స‌భ్యుడిగానే ఉన్నారు. అయితే.. ఆయ‌న మాత్రం వైసీపీకి మ‌ద్ద‌తుదా రుగా మారిపోయారు. అంతేకాదు... టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా..ఆయ‌న కుటుంబంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో గ‌న్న‌వ‌రంలో వంశీకి చెక్ పెట్టాల‌నేది టీడీపీ గ‌ట్టి నిర్న‌యం. ఈ క్ర‌మంలో టీడీపీ ఈ రెండునియోజ‌క‌వ‌ర్గాల‌పై ఫోకస్ పెట్టింది. గుడివాడ - గన్నవరంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి.. కొడాలి నాని - వల్లభనేని వంశీలను ఓడించాలనేది పార్టీ అధినేత లక్ష్యంగా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News